ఆచార్య ఇంపాక్ట్ ఎన్టీఆర్ మీద ఉందా?

ఆచార్య ఇంపాక్ట్ ఎన్టీఆర్ మీద ఉందా?

Rama Rao
Updated on: 7 July 2022 12:30 PM IST
Acharya Failure Effect On Jr NTR | Tollywood News
X

ఆచార్య ఇంపాక్ట్ ఎన్టీఆర్ మీద ఉందా?

Acharya Impact on NTR Film: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన "ఆచార్య" సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మెగా అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో బాగా నిరాశ చెందారు.

అయితే రామ్ చరణ్ కంటే ఈ సినిమా డిజాస్టర్ ఆయన ఇంపాక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. "ఆచార్య" డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తాను చేయబోతున్న సినిమాతో బిజీ అయిపోయారు. కానీ ఎన్టీఆర్ ని మాత్రం రెండు విషయాలు బాధిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలోనే ఒక సినిమా చేయాల్సి ఉంది.

అయితే కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య డిజాస్టర్ అవడంతో దాని ఇంపాక్ట్ తన సినిమా పైన పడుతుందేమోనని ఎన్టీఆర్ కలవర పడుతున్నారు. మరోవైపు సినిమా విడుదలైన రెండు నెలలు అయ్యాక కూడా ఇంకా కొరటాల ఎన్టీఆర్ సినిమా పనులు మొదలు పెట్టకుండా "ఆచార్య" డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను భర్తీ చేసే పనిలోనే బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో "ఆచార్య" ఎఫెక్ట్ రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ పైన ఎక్కువగా ఉందని కొందరు అంటున్నారు.

Rama Rao

Rama Rao

Next Story