రెండో రోజు భారీగా డ్రాప్ అయిన ఆచార్య వసూళ్లు..

Acharya Collection: ఏపీ, తెలంగాణలో రెండో రోజు షేర్ రూ. 5.15 కోట్లే

Rama Rao
Published on: 1 May 2022 2:26 PM IST
Acharya Box Office Collection Day 2 | Telugu Movie News
X

రెండో రోజు భారీగా డ్రాప్ అయిన ఆచార్య వసూళ్లు..

Acharya Collection: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, సంచలనాల దర్శకుడు కొరటాల శివ... రూపొందించిన ఆచార్య మూవీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకునేలా కన్పిస్తోంది. రెండో రోజు ఆచార్య వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయ్. ఏపీ, తెలంగాణలో రెండో రోజు షేర్ కేవలం రూ. 5.15 కోట్లు మాత్రమే రాబట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు తలలుపట్టుకుంటున్నారు. ఆదివారం ఆక్యుపెన్సీ‌ దారుణంగా పడిపోవడంతో లబోదిబోమంటున్నారు.

ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో రెండు రోజుల షేర్ రూ.34.65 కోట్లు కాగా, కర్నాటక, రెస్టాఫ్ ఆఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్ కలెక్షన్లు రూ. 4.20 కోట్లు వసూళ్లు రాబట్టింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల షేర్ రూ. 41.07 కోట్ల వసూలు చేస్తోంది. మెగా కాంబినేషన్లో మూవీ కావడంతో ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ. 140 కోట్లు చేసింది. చిరంజీవి మూవీ ఇంకా 100 కోట్లు రాబట్టాల్సి ఉంది. వీకెండ్ లోనే సినిమా ఫ్లాప్ టాక్ తో సతమతమవుతుండగా వీక్ డేస్‌లో కలెక్షన్ మరింత తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయ్. ఇటీవల విడుదలైన సినిమాల్లో ఇంతటి వైఫల్యం ఆచార్య ఒక్కటేనన్న అభిప్రాయం సినీ వర్గాలు నుంచి వ్యక్తమవుతోంది.

Rama Rao

Rama Rao

Next Story