Balagam Venu: బలగం వేణుకు హీరో దొరికాడోచ్.. ఎల్లమ్మ హీరో ఎవరంటే..?

Balagam Venu: బలగం సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు వేణు.

According to the Latest Buzz Balagam Venus Next Movie Yellamma With Hero Nitin
X

Balagam Venu: బలగం వేణుకు హీరో దొరికాడోచ్.. ఎల్లమ్మ హీరో ఎవరంటే..?

Balagam Venu: బలగం సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు వేణు. చావు చుట్టూ అల్లిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా తొలి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వేణు తర్వాతి చిత్రం ఏంటన్న దానిపై అందరిలో ఆసక్తి పెరిగింది.

ఈసారి వేణు స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎవరా స్టార్ హీరో అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. మొదట నాని ఈ సినిమాలో నటించనున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే నాని డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో చివరి నిమిషంలో తప్పుకున్నట్లు తర్వాత వార్తలు వచ్చాయి.

ఎల్లమ్మ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నాడు వేణు. తాజాగా ఈ సినిమాలో హీరోగా నితిన్ హీరోగా నటించనున్నాడు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

నితిన్‌ ఈ కథను ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశారని సమాచారం. రంగస్థల కళాకారుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. దిల్‌రాజు బ్యానర్‌లో సినిమా రూపుదిద్దుకోనుంది. త్వరలోనే ఎందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story