Allu Arjun: ఆ పుకార్లకు చెక్‌.. పుష్ప క్లైమాక్స్‌ షూటింగ్‌లో బన్నీ..

Allu Arjun: ఆ పుకార్లకు చెక్‌.. పుష్ప క్లైమాక్స్‌ షూటింగ్‌లో బన్నీ..

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 29 July 2024 5:15 PM IST
According to reports allu arjun going to join in pushpa 2 movie shooting
X

Allu Arjun: ఆ పుకార్లకు చెక్‌.. పుష్ప క్లైమాక్స్‌ షూటింగ్‌లో బన్నీ..

Allu Arjun: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఊహకందని విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. సీక్వెల్‌పై మరింత క్యూరియాసిటీ ఉన్న నేపథ్యంలో సుకుమార్ ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

ఇదంతా ఇలా ఉంటే.. అల్లు అర్జున్‌ ఇటీవల కుటుంబంతో కలిసి ట్రిప్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అదే సమయంలో బన్నీ గడ్డం లేకుండా కనిపించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌కు, సుకుమార్‌కు మధ్య వచ్చిన మనస్పార్థాల కారణంగానే బన్నీ ఇలా చేశాడంటూ వార్తలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. అయితే ఈ వార్తలన్నీ వట్టి పుకార్లేనని తేలిపోయింది. తాజాగా బన్నీ పుష్ప2 షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ట్రిప్‌ను ముగించుకొని హైదరాబాద్‌ వచ్చిన బన్నీ.. తిరిగి షూటింగ్‌లో పాల్గొనన్నుట్లు సమాచారం. ప్రస్తుతం పుష్ప2 సినిమా చిత్రీకరణలో రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. క్లైమాక్స్‌ పార్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇతర నటుపై సీన్స్‌ తెరకెక్కిస్తున్నారు. అయితే వచ్చే నెలలో జరిగే కొత్త షెడ్యూల్‌లో బన్నీ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు చక్కర్లు కొడుతోన్న పుకార్లకు చెక్‌ పెట్టినట్లు అయ్యింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న పుష్ప సీక్వెల్ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో తెలియాలంటే సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story