Prabhas: ప్రభాస్‌ సినిమాలో విలన్స్‌గా.. బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌..

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 27 Sept 2024 10:15 PM IST
According to latest reports saif ali khan and kareena going to act as negative role in prabhas spirit movie
X

Prabhas: ప్రభాస్‌ సినిమాలో విలన్స్‌గా.. బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌.. 

యంగ్‌ రెబల్ స్టార్‌ నటిస్తున్న చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్, యానిమల్‌ వంటి చిత్రాలతో ఇండియన్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో సందీప్‌ రెడ్డి-ప్రభాస్‌ కాంబినేషన్‌ సినిమా వస్తుందనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు ఉండేలా సందీప్‌ వంగా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే బాలీవుడ్‌కు చెందిన స్టార్‌ కపుల్స్ ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌లు స్పిరిట్ మూవీలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ స్పిరిట్‌ మూవీలో నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే సైఫ్‌ అలీఖాన్‌ ఇటీవల తెలుగులో వరుసగా చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్‌ చిత్రంలో సైఫ్‌ రావణుడి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన దేవర చిత్రంలోనూ సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. దీంతో స్పిరిట్‌లో కూడా సైఫ్‌ అలీఖాన్‌తో పాటు అతని భార్య కరీనా నటిస్తుందన్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే స్పిరిట్ మూవీలో ప్రభాస్‌ ఒక పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story