Devara Collections: 'దండయాత్ర.. ఇది దేవర దండయాత్ర'.. కలెక్షన్ల ఊచకోత అంతే..!

Devara Collections: ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Oct 2024 2:20 PM IST
Devara Collections: దండయాత్ర.. ఇది దేవర దండయాత్ర.. కలెక్షన్ల ఊచకోత అంతే..!
X

Devara Collections: 'దండయాత్ర.. ఇది దేవర దండయాత్ర'.. కలెక్షన్ల ఊచకోత అంతే..! 

Devara Box Office Collection: ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. సెప్టెంబర్‌ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త సంచనలు సృష్టిస్తోంది. రికార్డు కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందీ మూవీ. రాజమౌళి దర్శకత్వంలో నటించిన తర్వాత హీరో సినిమా ఫ్లాప్‌ అవుతుందన్న సెంటిమెంట్‌ను దేవరతో బ్రేక్‌ చేశాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేవర హంగామా కొనసాగుతూనే ఉంది.

విడుదలైన తొలిరోజే రూ. 172 కోట్లు గ్రాస్‌ వసూలు చేసిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఏడు రోజుల్లో ఏకంగా రూ. 405 కోట్ల గ్రాస్‌ వసూలు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగానే గురువారం పార్క్‌ హయాత్‌లో ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్లకు మిక్కిలినేని సుధాకర్‌, నాగ వంశీ కలిసి పార్టీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దసరా సెలవులు ఉండడం, మరే పెద్ద సినిమా భరీలో లేకపోవడంతో దేవర దండయాత్ర మరింత కొనసాగే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. మరొక్క వారం రోజులు ఇదే హవా కొనసాగితే దేవరం వసూళ్లు రూ. 500 కోట్లు దాటడమే కాకుండా రూ. 700 కోట్ల వరకు చేరుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ నట విశ్వరూపం, అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌, కొరటాల శివ దర్శకత్వం ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చిందని చెప్పాలి. అలనాటి అందాల తార జాన్వీ కపూర్ ఈ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక దేవర రెండు పార్టులుగా వస్తున్న విషయం తెలిసిందే. తొలి పార్ట్ ఊహించని విజయం అందుకోవడంతో సహజంగానే పార్ట్‌2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి పార్ట్‌2 విషయంలో కొరటాల మరెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story