Janhvi Kapoor: అందాల జాన్వీకి తెలుగులో మరో అవకాశం.. హీరో ఎవరో తెలుసా.?

Janhvi Kapoor: అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఎట్టకేలకు ఖరారైన విషయం తెలిసిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 July 2024 10:55 AM IST
According to Latest Reports Actress Janhvi Kapoor Going to Act in Nani Movie
X

Janhvi Kapoor: అందాల జాన్వీకి తెలుగులో మరో అవకాశం.. హీరో ఎవరో తెలుసా.?

Janhvi Kapoor: అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఎట్టకేలకు ఖరారైన విషయం తెలిసిందే. 2018లో వచ్చిన దడక్‌ చిత్రం ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తెలుగు తెరకు మాత్రం ఆలస్యంగా పరిచయవుతోంది. ఎన్నో రోజుల నుంచి జాన్వీ తెలుగు తెరకు సంబంధించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న దేవరతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ కాన్ఫామ్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదలవ్వకముందే జాన్వీ తెలుగులో వరుసగా మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుటోంది. ఇప్పటికే రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో జాన్వీ అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఫ్రారంభం కానుంది. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ మరో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి జాన్వీ కపూర్‌ నేచురల్ స్టార్‌ నానికి జోడిగా నటించబోతోంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దసరా తర్వాత సేమ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో జాన్వీని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. జాన్వీ కూడా ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కాల్షీట్లకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చర్చలు ముగిసిన వెంటనే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత నాని, జాన్వీ మూవీ షూటింగ్ ప్రారంభంకానుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story