వాయిదాపడిన తమన్నా హారర్ సినిమా

వాయిదాపడిన తమన్నా హారర్ సినిమా
x
Highlights

మిల్కీ బ్యూటీ తమన్నా, ప్రభుదేవా హీరోహీరోయిన్లుగా నటించిన 'దేవి' సినిమా తెలుగులో 'అభినేత్రి'గా విడుదలై మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు...

మిల్కీ బ్యూటీ తమన్నా, ప్రభుదేవా హీరోహీరోయిన్లుగా నటించిన 'దేవి' సినిమా తెలుగులో 'అభినేత్రి'గా విడుదలై మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా 'అభినేత్రి 2' సినిమా మే 1వ తారీఖున విడుదల కానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో రెండు దెయ్యాలు ఉండబోతున్నాయి అనే విషయం అర్థమవుతుంది.

కారణం ఇంకా తెలియదు కానీ 'అభినేత్రి 2' సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా మే 31న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే అదే రోజున కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'ఎన్ జీ కే' సినిమా కూడా విడుదల కాబోతోంది. అయినప్పటికీ సూర్య సినిమా తో క్లాష్ అవ్వడానికి సిద్ధమవుతోంది తమన్నా. 'అభినేత్రి' సినిమాకి దర్శకత్వం వహించిన ఏ ఎల్ విజయ్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. నందిత శ్వేతా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై రవీంద్రన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories