Bigg Boss 7 Telugu: ఎలిమినేట్‌ అయినా.. భారీగానే సంపాదించిన సందీప్‌ మాస్టర్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా?

Bigg Boss 7 Telugu Updates: హమ్మయ్య.. ఎట్టకేలకు బిగ్‌బాస్ 7వ సీజన్‌లో తొలి మేల్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేట్ అయ్యాడు.

Arun Chilukuri
Updated on: 30 Oct 2023 10:27 AM IST
Aata Sandeep Eliminated 8 Weeks in Bigg Boss Telugu Season 7 Telugu Check Here Sandeep Master Remuneration
X

Bigg Boss 7 Telugu: ఎలిమినేట్‌ అయినా.. భారీగానే సంపాదించిన సందీప్‌ మాస్టర్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా?

Bigg Boss 7 Telugu Updates: హమ్మయ్య.. ఎట్టకేలకు బిగ్‌బాస్ 7వ సీజన్‌లో తొలి మేల్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేట్ అయ్యాడు. గత 7 వారాలుగా లేడీస్ మాత్రమే హౌజ్‌ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. అయితే, ఈ వారం కూడా మరో లేడీ అంటే కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపించాయి. అయితే, ఈ ఊహించని షాక్‌తో అందర్ని ఆశ్చర్యపరిచాడు బిగ్ బాస్. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా కొనసాగుతున్న ఆట సందీప్‌ను అనూహ్యంగా ఎలిమినేట్‌ చేశారు.

తొలి వారం నుంచి నామినేషన్స్‌లో కనిపించని ఆట సందీప్‌ ఇలా బయటకు రావడం షాక్ ఇచ్చింది. సందీప్ మాస్టర్ ఏకంగా‌ 5 వారాల పాటు ఇమ్యూనిటీ పవర్‌ ఉండడం వల్ల ఇన్ని వారాలు నామినేషన్స్‌లోకి రాలేదు. ఇమ్యూనిటీ పవర్ పోయిన వెంటనే నామినేషన్స్‌లోకి వచ్చాడు. సందీప్‌ మాస్టర్‌కు ఓటు బ్యాంక్‌ చాలా తక్కువగా ఉండడంతో.. 8వ వారం ఎలిమినేట్ అయ్యాడు. మొత్తంగా శివాజీ, ప్రియాంక, గౌతమ్‌, భోలే షా వళి, అమర్‌ దీప్‌ చౌదరి, అశ్విని శ్రీ, శోభా శెట్టితో పాటు నామినేషన్స్‌లోకి వచ్చిన ఆట సందీప్‌.. వీళ్ల ఓటింగ్ ముందు తేలిపోయాడు.

సందీప్‌ మాస్టర్‌ 8 వారాల పాటు హౌస్‌లో ఉన్నాడు. ఎలిమినేట్ అయ్యాక చాలా ఎమోషనల్‌ అయ్యాడు. ఇదంతా పక్కన పెడితే.. సందీప్‌ మాస్టర్‌ ఇంటికి వెళుతూ భారీగానే డబ్బు తీసుకెళ్లాడంట. వారానికి సుమారు రూ. .2.75 లక్షలు చొప్పున తీసుకున్నాడంట. ఇలా 8 వారాలకు గానూ సుమారు రూ.22 లక్షలు పైగానే రెమ్యూనరేషన్ తీసుకున్నాడంట. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఇతర కంటెస్టెంట్లతో పోల్చితే భారీ అమౌంట్‌నే పట్టేశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story