ఈ హీరోయిన్‌ ని గుర్తు పట్టారా? ఎలా మారిపోయిందో..?

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి, అప్పట్లో వెలుగొందిన ఓ నటి ప్రస్తుతం ఎలా తయారైందో చూస్తే షాకవ్వాల్సిందే.

Venkata Chari
Published on: 7 Jun 2021 7:04 PM IST
Aapadbandhavudu Heroine Meenakshi Seshadri Latest photos
X

మీనాక్షి శేషాద్రి (ఫొటో ట్విట్టర్)

Meenakshi Seshadri: టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి, అప్పట్లో వెలుగొందిన ఓ నటి ప్రస్తుతం ఎలా తయారైందో చూస్తే షాకవ్వాల్సిందే. ఇంతకీ ఈ హీరోయిన్‌ ఎవరంటే.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'ఆపద్బాంధవుడు' సినిమాలో నటించించింది. ఆమె మీనాక్షి శేషాద్రి.


కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటనతో పాటు డ్యాన్సులతోనూ ఆకట్టుకుంది మీనాక్షి శేషాద్రి.


18 ఏళ్ల వయసులోనే 'మిస్‌ ఇండియా' టైటిల్‌ సొంతం చేసుకుంది.


తెలుగులో మొదటి సినిమా 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' లో నటించింది. కానీ, అంతగా గుర్తింపు రాలేదు. ఆపద్బాంధవుడు తో బాగా పాపులర్‌ అయింది.


బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు 30 సినిమాల్లో నటించింది.


చిరంజీవి సరసన గ్యాంగ్‌లీడర్‌ బాలీవుడ్ రీమేక్‌ ఆజ్ కా గూండారాజ్ సినిమాలోనూ నటించింది.


1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఈమెకు ఇద్దరు పిల్లలున్నారు.


ప్రస్తుతం 57 ఏళ్ల మీనాక్షి రూపాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అసలు ఈమె మీనాక్షేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఎంతో అందంగా ఉన్న మీనాక్షి ఇలా అయ్యిందేంటి ఫీలవుతున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story