Rajinikanth : రజనీకాంత్ కాళ్లు మొక్కిన అమీర్ ఖాన్.. వద్దు వద్దంటూ అడ్డుకున్న సూపర్ స్టార్

Rajinikanth : రజనీకాంత్ కాళ్లు మొక్కిన అమీర్ ఖాన్.. వద్దు వద్దంటూ అడ్డుకున్న సూపర్ స్టార్
x

Rajinikanth : రజనీకాంత్ కాళ్లు మొక్కిన అమీర్ ఖాన్.. వద్దు వద్దంటూ అడ్డుకున్న సూపర్ స్టార్

Highlights

సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్‌కు అందరూ గౌరవం ఇస్తారు. 74 ఏళ్ల వయసులో కూడా ఆయన యాక్టివ్‌గా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఆయన తదుపరి సినిమా కూలీ త్వరలో విడుదల కానుంది.

Rajinikanth : సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్‌కు అందరూ గౌరవం ఇస్తారు. 74 ఏళ్ల వయసులో కూడా ఆయన యాక్టివ్‌గా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఆయన తదుపరి సినిమా కూలీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్, రజనీకాంత్ కాళ్ళకు నమస్కరించబోగా, రజనీకాంత్ వెంటనే అడ్డుకుని, ఆయనపై తన ప్రేమను చూపించారు.

కూలీ సినిమాలో ఆమిర్ ఖాన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించారు. ట్రైలర్ విడుదల వేడుకకు అదే గెటప్‌లో రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన స్టేజ్‌పైకి రాగానే, మిగతా నటీనటులు నిలబడి గౌరవం చూపించారు. అభిమానులు జై కొట్టారు. ఆమిర్ ఖాన్ రజనీకాంత్ దగ్గరికి వెళ్లి కాళ్ళకు నమస్కరించడానికి వంగగానే, రజనీకాంత్ వెంటనే అడ్డుకుని ఆయన చేతులు పట్టుకుని పైకి లేపారు. ఆ తర్వాత ఇద్దరు హ్యాండ్ షేక్ చేసుకుని, ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల కలయిక చూసి అభిమానులు చాలా సంతోషపడ్డారు.

ట్రైలర్ విడుదల వేడుకలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ, కూలీ సినిమాలో నటించడానికి ప్రధాన కారణం రజనీకాంత్ పైన ఉన్న గౌరవమే అని చెప్పారు. "రజనీకాంత్ గారి కోసమే నేను ఈ సినిమా అంగీకరించాను. ఆయన నవ్వు, కళ్ళు, ఆయనలోని ఎనర్జీ నాకు చాలా ఇష్టం. నేను కథ వినలేదు, డబ్బులు కూడా అడగలేదు, డేట్స్ గురించి కూడా అడగలేదు. కేవలం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందని మాత్రమే అడిగాను" అని చెప్పి రజనీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.



ఈ కూలీ సినిమాకు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటుగా శ్రుతి హాసన్, ఉపేంద్ర, రచితా రామ్, నాగార్జున, ఆమీర్ ఖాన్, పూజా హెగ్డే వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories