Green India Challenge: 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌'లో పాల్గొన్న అమీర్ ఖాన్, నాగచైతన్య

* బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మొక్కలు నాటిన అమీర్‌ ఖాన్ * ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు : అమీర్ ఖాన్

admin1
Updated on: 9 Oct 2021 1:14 PM IST
Aamir Khan and Naga Chaitanya Participated in Green India Challenge With MP Santosh Kumar at Begumpet Airport
X

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌'లో పాల్గొన్న అమీర్ ఖాన్, నాగచైతన్య (ట్విట్టర్ ఫోటో)

Green India Challenge: కోట్ల హృదయాలను కదిలించిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' బాలీవుడ్ సూపర్ స్టార్, విలక్షణ చిత్రాల హీరో అమీర్‌ ఖాన్‌కు చేరింది.

హైదరాబాద్ కు వచ్చిన మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, తన సహానటుడు లాల్ సింగ్ చద్ధా, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి బేగంపేట ఎయిర్‌పోర్టులో 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో భాగంగా మొక్కలు నాటారు. ఇప్పటివరకు ఎన్నో ఛాలెంజ్ లను చూసాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్‌ను మనకు అందించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు.

admin1

admin1

Next Story