రెండు బుర్రలున్న వాడిగా ఆది

రెండు బుర్రలున్న వాడిగా ఆది
x
Highlights

సాయికుమార్ కుమారుడిగా ఆది సాయి కుమార్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి కెరీర్ మొదట్లో మంచి హిట్లనే నమోదు చేసుకున్నాడు కానీ కథల ఎంపికలో చేసిన...

సాయికుమార్ కుమారుడిగా ఆది సాయి కుమార్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి కెరీర్ మొదట్లో మంచి హిట్లనే నమోదు చేసుకున్నాడు కానీ కథల ఎంపికలో చేసిన కొన్నిపొరపాట్లు వల్ల వరుసగా డిజాస్టర్లు అందుకున్నాడు. తాజాగా ఆది చేతుల్లో ఇప్పుడు రెండు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. ఈ చిత్ర టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో ఎన్ఎస్జీ కమాండో గా కనిపించిన ఆది కచ్చితంగా హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఆది చేతిలో ఉన్న రెండవ సినిమా ఒక బుర్ర కథ అని తెలుస్తోంది.

హాస్య చిత్రాలకు రచయితగా పేరున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయి డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆది రెండు బుర్రలున్న వాడిగా పుడతాడట. ఒక బుర్ర కేవలం ఆలోచనలకు మాత్రమే పనిచేసే అయితే మరొకటి వెరైటీ లైన్ లో సాగుతుందని తెలుస్తోంది. హీరోకి ఎదో జబ్బు ఉండడం అనే కాన్సెప్ట్ ట్రెండ్ 'భలే భలే మగాడివోయ్' హిట్ తో మొదలైతే 'సవ్యసాచి' సినిమా ఫ్లాప్ తో బ్రేక్ పడిందని చెప్పచ్చు. కథ కొత్త గానే ఉన్నప్పటికీ ఈ సినిమా ఆది కి హిట్ అందిస్తుందో లేదో చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories