స్పోర్ట్స్ సినిమాలో యూటర్న్ నటుడు

స్పోర్ట్స్ సినిమాలో యూటర్న్ నటుడు
x
Highlights

ఒకవైపు హీరోగా తెలుగు తమిళ భాషల్లో నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రల్లో అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో కూడా అదరగొట్టే పర్ఫామెన్స్ ఇస్తూ అందరి...

ఒకవైపు హీరోగా తెలుగు తమిళ భాషల్లో నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రల్లో అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో కూడా అదరగొట్టే పర్ఫామెన్స్ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్నాడు ఆది పినిశెట్టి. ఈ మధ్యనే 'నీవెవరో' సినిమాలో హీరోగా నటించిన ఆది పినిశెట్టి సమంత 'యూటర్న్' సినిమాలో ముఖ్యపాత్ర పోషించాడు. మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న అది త్వరలోనే హీరోగా మరొక సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా ఒక ద్విభాషా చిత్రంగా విడుదల కాబోతోంది అని తెలుస్తోంది. అంతేకాక ఈ సినిమా కి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉండబోతోందని సమాచారం.

కొత్త దర్శకుడు పృధ్వి ఆదిత్య ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అది పూర్తవగానే షూటింగ్ తెలుగు మరియు తమిళంలో జరగనుంది. ఆది ఈ సినిమాలో ఒక క్రీడాకారుడు పాత్రలో కనిపించబోతున్నాడు కానీ ఈ సినిమా ఏ క్రీడ నేపథ్యంలో సాగనుంది అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు పీఎంఎం ఫిల్మ్స్ మరియు గ్లోరీ స్టూడియోస్ సంస్థలు సహ నిర్మాణ సంస్థలుగా వ్యవహరించబోతున్నాయి. ప్రవీన్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories