Sivudu Movie Poster: మరో థ్రిల్లర్‌ మూవీతో వస్తున్న ఆది పినిశెట్టి

Sivudu Movie Poster: 'మలుపు', 'వైశాలి', 'యూటర్న్', 'నీవెవరో' వంటి వైవిద్య చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆది పినిశెట్టి.

Samba Siva Rao
Updated on: 12 March 2021 11:17 AM IST
Sivudu Movie Poster
X

శివుడు మూవీ పోస్టర్ (ట్విట్టర్ ఇమేజ్ )

Sivudu Movie Poster: 'మలుపు', 'వైశాలి', 'యూటర్న్', 'నీవెవరో' వంటి వైవిద్య చిత్రాలతో అటు కోలివుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆది పినిశెట్టి. తాజాగా ఆయన మరో థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నారు. ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో విశాల్ 'ప‌ల్నాడు', కార్తీ 'నా పేరు శివ'చిత్రాల ద‌ర్శకుడు సుశీంద్రన్ డైరెక్షన్‌ ఓ సినిమా రూపొందనుంది. యాక్షన్‌, డ్రామా, స‌స్పెన్స్ ఎలిమెంట్స్‌తో రూర‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఫిల్మ్ తెరకెక్కనుంది.

గురువారం మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'శివుడు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ లోగో ఆసక్తికరంగా ఉంది. గురువారం రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆది పినిశెట్టి తీక్షణ‌మైన చూపుల‌తో.. త‌ల‌కు, ముక్కుకు గాయాల‌తో క‌నిపిస్తున్నారు. టైటిల్ లోగోపై కూడా ర‌క్తం మరక కనిపిస్తోంది. ప్రస్తుతం శివుడు చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి.

ర‌విరాజా పినిశెట్టి సమర్పనలో.. ఆద‌ర్శ చిత్రాల‌య ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై స‌త్యప్రభాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా మరకతమని, మలుపు ఫేమ్ నిక్కీ గ‌ల్రానీ నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్ నటిస్తోంది. సునీల్‌, హ‌రీష్ ఉత్తమ‌న్‌, కంచ‌ర‌పాలెం రాజు, జేపీ, శ‌త్రు కీల‌క పాత్రలు షోషిస్తున్నారు. కాశీ విశ్వనాథ‌న్ ఎడిట‌ర్ కాగా, చంద్రబోస్ పాట‌లు రాశారు.ఈ చిత్రానికి జై మ్యూజిక్ అందిస్తున్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story