హాలీవుడ్లో అడుగుపెట్టనున్న అల్లు అర్జున్

Allu Arjun: హాలీవుడ్ నుంచి ఆఫర్లు అందుకుంటున్న స్టైలిష్ స్టార్

Jyothi
Published on: 26 Aug 2022 12:45 PM IST
A Stylish Star  is Receiving offers from Hollywood
X

హాలీవుడ్లో అడుగుపెట్టనున్న అల్లు అర్జున్

Allu Arjun: "పుష్ప: ది రైజ్" సినిమాతో టాలీవుడ్ సూపర్ స్టార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా అద్భుతమైన కలెక్షన్లతో రికార్డులు సృష్టించారు. ఇక మలయాళంలో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన అల్లు అర్జున్ ఏకంగా హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఇండియా డే పెరేడ్ కి న్యూయార్క్ వెళ్లిన అల్లు అర్జున్ ఒక హాలీవుడ్ బిగ్గీతో మీ కలిసారని అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అల్లు అర్జున్ హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.

ఇప్పటికే హాలీవుడ్ నుంచి ఒక ప్రముఖ నిర్మాత మరియు డైరెక్టర్ అల్లు అర్జున్ ను సంప్రదించి భారీ ఆఫర్ ను ఇచ్చినట్లుగా సమాచారం. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఈ మధ్యనే న్యూయార్క్ మేయర్ కూడా తగ్గేదే లే మేనరిజం ని చేసి చూపించారు. ఇక ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్న కొందరు అల్లు అర్జున్ కు హాలీవుడ్ లో కూడా ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం పుష్ప సినిమాకి సీక్వెల్ అయిన "పుష్ప: ది రూల్" తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల గురించి ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story