Kona Venkat: స్నేహితుడి కోసం గంజాయి అమ్మిన స్టార్ రైటర్..

Kona Venkat: "అతని కోసం గంజాయి అమ్మాను," అంటున్న కోన వెంకట్

Jyothi
Updated on: 10 Jan 2023 8:30 PM IST
A Star Writer Kona Venkat Says Sold Ganjai for a Friend
X

Kona Venkat: స్నేహితుడి కోసం గంజాయి అమ్మిన స్టార్ రైటర్

Kona Venkat: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ రైటర్లలో కోన వెంకట్ కూడా ఒకరు. డైరెక్టర్ శ్రీను వైట్ల తో కలిసి ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. స్క్రీన్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న కోన వెంకట్ ఆ తరువాత కోనా ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్లో సినిమాలను నిర్మించడం కూడా మొదలుపెట్టారు. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకి కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు.

కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్ లో జనవరి 13న విడుదల కాబోతున్న ఈ సినిమా లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన స్నేహితుడి కోసం గంజాయి అమ్మిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు కోన వెంకట్. కష్టాల్లో ఉన్న ఫ్రెండ్ సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడని, హాస్పిటల్ లో ఉన్న అతని కష్టాలు తీర్చడానికి అతను పండించిన గంజాయిని గోవా వెళ్లి మరి అమ్మానని చెప్పి కోనా వెంకట్ పెద్ద షాక్ ఇచ్చారు.

ఆ సమయంలో తన మిగతా స్నేహితుల సహాయంతో ఆదిలాబాద్ నుంచి రెండు చెక్ పోస్ట్ లను దాటించి గోవాకి గంజాయిని తీసుకువెళ్లామని, అప్పట్లో తనకే ఉన్న క్రిమినల్ బ్రెయిన్ తరువాత క్రియేటివ్ బ్రెయిన్ గా మారిందని అన్నారు కోన వెంకట్. ఒకవేళ అతను పట్టుపడితే పెద్ద గొడవ అయ్యేదని కానీ ఆ సమయంలో వేరే వాటి గురించి ఆలోచించకుండా కేవలం తన ఫ్రెండ్ కి సహాయం చేయాలన్న ఒకే ఒక కారణంతో అలా చేసినట్లు చెబుతున్నారు కోన వెంకట్.

Jyothi

Jyothi

Next Story