జాతీయ సినిమా అవార్డులపై దుమారం.. సందేశాత్మక చిత్రాలు అవార్డులకు నోచుకోవా..?

National Awards 2023: అల్లు అర్జున్ నటనకే అవార్డు ఇచ్చారు ఆయన పాత్రకు కాదని ఓ వర్గం కామెంట్స్

Shekhar G
Published on: 27 Aug 2023 12:49 PM IST
A Scandal Over The National Film Awards
X

జాతీయ సినిమా అవార్డులపై దుమారం.. సందేశాత్మక చిత్రాలు అవార్డులకు నోచుకోవా..?

National Awards 2023: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ సినిమా అవార్డులపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. ఓ వైపు టాలీవుడ్‌కు ఏకంగా 10 నేషనల్ అవార్డులు దక్కాయి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఈసారి అవార్డులు సొంతం చేసుకుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. అయితే ఇక్కడితో ఆగిపోలేదు ఈ వ్యవహారం.. జాతీయ సినిమా అవార్డుల ప్రకటనపై సరికొత్త వివాదం మొదలైంది. అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించడంపై పెద్ద దుమారమే రేగుతోంది.

ఏ సోషల్‌మీడియా ప్లాట్ ఫామ్‌లో చూసినా అవార్డుల గురించే జోరుగా చర్చ జరుగుతోంది. అడవిలో రెడ్ శాండల్ స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్‌కి జాతీయ అవార్డు ఇవ్వడమేంటంటూ ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దళిత బిడ్డకు న్యాయం చేసిన జై భీమ్ లాంటి సినిమాకు అవార్డ్ ఇవ్వకపోవడంపై మండిపడుతోంది మరో వర్గం. ఇక, హీరో నాని తన స్టేటస్‌లో జై భీమ్ అంటూ పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఆ పోస్టులో జై భీమ్ పక్కన పగిలిన గుండె సింబల్‌ను పెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది.

Shekhar G

Shekhar G

Next Story