Prabhas: ప్రభాస్ సినిమాకి వచ్చిన భారీ ఓటిటీ డీల్

Prabhas: ప్రభాస్ సినిమా కి భారీ ఆఫర్ వచ్చిందిగా..

Jyothi
Published on: 11 Dec 2022 1:16 PM IST
A Huge OTT Deal for Prabhas Movie
X

Prabhas: ప్రభాస్ సినిమాకి వచ్చిన భారీ ఓటిటీ డీల్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మధ్యనే చిత్ర బృందం ఎలాంటి అప్డేట్ లేకుండానే ప్రభాస్తో ఒక వారం పాటు షూటింగ్ను మొదలుపెట్టింది ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన నిధి అగర్వాల్తో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.

తాజా సమాచారం ప్రకారం నిర్మాతలకి ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కే వంటి సినిమాలు ఇంకా విడుదల కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అందుకే రెండేళ్ల పాటు సినిమాని పైప్ లైన్ లో ఉంచడం కంటే ఓటిటీ లో విడుదల చేస్తే బాగుంటుందని ఆ ఓటిటీ ప్లాట్ఫామ్ చిత్ర దర్శక నిర్మాతలకు పెద్ద ఆఫర్ ఇచ్చిందట. ప్రస్తుతానికి అయితే నిర్మాతలు ఇంకా ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు.

ప్రభాస్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని సినిమాని ఓటిటీలో విడుదల చేస్తే అభిమానులు నిరాశ పడే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్న ఒక ప్రముఖ తెలుగు డిస్ట్రిబ్యూటర్ నిర్మాతలకి ఈ ఆఫర్ ని తీసుకోవద్దని సినిమా ఎట్టి పరిస్థితులను థియేటర్లలో విడుదలయితేనే బాగుంటుందని సలహా ఇచ్చారట. మరి చిత్ర నిర్మాతలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Jyothi

Jyothi

Next Story