Ram Charan: ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రామ్‌చరణ్‌కు ఘన స్వాగతం

A Grand Welcome to Ram Charan Reached Hyderabad From Delhi
x

Ram Charan: ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రామ్‌చరణ్‌కు ఘన స్వాగతం

Highlights

Ram Charan: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు భారీగా చేరుకున్న మెగా ఫ్యాన్స్

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ ఈవెంట్ తర్వాత హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చరణ్‌కు వందలాదిగా తరలివచ్చిన మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ పురస్కారం లభించింది. ఈ ఈవెంట్ తర్వాత చరణ్ అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో అమిత్‌షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ భేటీ అయ్యారు. చిరంజీవి తన కుమారుడిని తీసుకెళ్లి షాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా చెర్రీని అమిత్ షా అభినందించి, శాలువాతో సత్కరించారు. అక్కడి నుంచి చరణ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ చేరుకున్నారు. అభిమానుల భారీ ర్యాలీ మధ్య ఇంటికి వచ్చారు రామ్‌చరణ్.

Show Full Article
Print Article
Next Story
More Stories