చచ్చిపోవాలని అనుకున్న స్నేహితుడి నిర్ణయం బాలయ్య కారణంగా మారింది

Unstoppable with NBK
x

చచ్చిపోవాలని అనుకున్న స్నేహితుడి నిర్ణయం బాలయ్య కారణంగా మారింది

Highlights

సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అని అర్థరాత్రి బాలకృష్ణ కి ఫోన్ చేసిన స్నేహితుడు

Unstoppable with NBK: "అన్ స్టాపబుల్" టాక్ షో తో బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్న బాలకృష్ణ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఒక ఎపిసోడ్ లో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక షాకింగ్ విషయాన్ని అందరితో పంచుకున్నారు. "ఒకరోజు అర్ధరాత్రి నా స్నేహితుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నేను బ్రతికి ఉండటం అనవసరం, ఉండి సాధించింది ఏమీ లేదు, నా ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అని నా స్నేహితుడు తన నిర్ణయాన్ని చెప్పాడు.

నీ నిర్ణయం నేను గౌరవిస్తాను కానీ సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి కలుద్దాం, కలిసి ఒక పెగ్గు వేద్దాం ఆ తర్వాత ఎవరి గ్లాస్ వాళ్లు తీసుకుని వెళ్ళిపోదాం అని అన్నాను," అని వారి సంభాషణ తెలిపారు బాలయ్య. "ఆ తర్వాత మేము రెస్టారెంట్ కి వెళ్ళాం. డోర్ తీయగానే అక్కడ మా స్నేహితులందరూ ఉన్నారు. దీంతో చనిపోదాం అనుకుంటున్న నా ఫ్రెండ్ షాక్ అయ్యాడు. ఏంటి అంతా ఇక్కడున్నారు అని అడగ్గా అందరూ నా వైపు వేలెత్తి చూపించారు.

యూపీఎస్సీ లో ఫెయిల్ అయితే చనిపోవాలా అంటూ అందరూ తనకి క్లాస్ పీకారు. ఆ తర్వాత అదే రెస్టారెంట్లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. చచ్చిపోదాం అనుకున్న నా స్నేహితుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. జీవితంలో అన్నీ సందర్భాలని సీరియస్ గా తీసుకోకూడదు. సక్సెస్ కోసం శక్తివంచన లేకుండా శ్రమించాలి, అయినా సక్సెస్ రాకపోతే అక్కడితో వదిలేసి కొత్త లైఫ్ నీ డిజైన్ చేసుకోవాలి. అంతేకానీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని జీవితంలో ఓడిపోయామని చచ్చిపోవటం కరెక్ట్ కాదని," అన్నారు బాలయ్య.

Show Full Article
Print Article
Next Story
More Stories