Aarthi Agarwal Biopic : వెండితెర పైకి ఆర్తీ అగ‌ర్వాల్ బయోపిక్?

Aarthi Agarwal Biopic : తెలుగులో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. సినీ రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్ లు

Krishna
Published on: 4 Aug 2020 10:57 AM IST
Aarthi Agarwal Biopic : వెండితెర పైకి ఆర్తీ అగ‌ర్వాల్ బయోపిక్?
X
aarthi agarwal (File Photo)

Aarthi Agarwal Biopic : తెలుగులో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. సినీ రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్‌, వై.ఎస్‌.ఆర్ బ‌యోపిక్స్ తో పాటు సావిత్రి బ‌యోపిక్ లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు మరో బయోపిక్ వెండితెర పైకి రాబోతుంది. అయితే అది ఎవరో కాదు.. దివంగత నటీ ఆర్తీ అగ‌ర్వాల్.. ఈమె జీవితం ఆధారంగా బ‌యోపిక్ రూపొంద‌నుంద‌ని ఇప్పుడు వార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ సినిమాని త్వరగా తెరకెక్కించి ఓటీటీలో తెరకెక్కించే ఆలోచనలో ఓ బడా సంస్థ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన త్వరలో ఓ ఆఫీషియల్ అనౌన్స్ రానుంది.

ఇక ఆర్తీ అగ‌ర్వాల్ విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తర్వాత ఇంద్ర సినిమలో మెగాస్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఇక నాగార్జున, ఎన్టీఆర్ , మహేష్ బాబు, రాజశేఖర్, ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి మొదలగు స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది ఆర్తీ అగ‌ర్వాల్.. ఇక ఆ తర్వాత ఓ టాలీవుడ్ హీరోతో ఆమె ప్రేమాయణం నడపడం, ఆ తర్వాత బ్రేక‌ప్‌, లాంటి పరిణామాలు ఆమె జీవితంలో చోటుచేసుకున్నాయి.

ఇక 2007లో ఉజ్వల్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ అతనితో 2009 లోనే ఆర్తీ విడాకులు తీసుకుంది. ఇక ఆ తర్వాత సినిమా రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బ‌రువు త‌గ్గడానికి చేయించుకున్న లైపో ఆప‌రేష‌న్ విక‌టించ‌డంతో 2015, జూన్ 6న ఆమె క‌న్నుమూసింది. దీనితో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

Krishna

Krishna

Next Story