Samantha: దసరాకి పెద్ద అనౌన్స్‌మెంట్ చేయబోతున్న సమంత

Samantha: తాజా సమాచారం ప్రకారం స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో మరింత బిజీ కాబోతోందని తెలుస్తోంది.

admin1
Published on: 14 Oct 2021 8:14 AM IST
A Big Announcement Coming From Samantha On Dasara
X

Samantha: దసరాకి పెద్ద అనౌన్స్‌మెంట్ చేయబోతున్న సమంత

Samantha: తాజా సమాచారం ప్రకారం స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో మరింత బిజీ కాబోతోందని తెలుస్తోంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కెరీర్ లో ఇంకా ఎత్తుకు ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది సామ్. ఈ నేపథ్యంలోనే సమంత దసరా సందర్భంగా అక్టోబర్ 15న ఒక పెద్ద అనౌన్స్‌మెంట్ చేయడానికి సిద్ధం అవుతోందట. ఈ నేపథ్యంలో సమంత ఈ మధ్యనే ఒక బాలీవుడ్ ఫిలిమ్ సైన్ చేసిందని ఆ సినిమాకి సంబంధించిన విషయాలను ఆమె దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నారని కొందరు చెబుతున్నారు కానీ దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంది.

ఇక మరోవైపు సమంత గత కొంత కాలంగా కొన్ని కథలను వింటుందని తాజాగా కృష్ణ ప్రసాద్ అనే ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఏదేమైనా దీని గురించి క్లారిటీ రావాలన్నా సమంత నోరు విప్పాల్సిందే. మరో వైపు సమంత గుణశేఖర్ దర్శకత్వంలో "శాకుంతలం" అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు సమంత, నయనతార, విజయ్ సేతుపతి నటించిన "కాతు వాకుల రెండు కాదల్" సినిమా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల కాబోతుంది. నాగచైతన్య తో విడాకులు తరువాత సమంత కెరీర్ మీద దృష్టి పెట్టినట్లు సమాచారం.

admin1

admin1

Next Story