'90 ఎం.ఎల్' తో కార్తికేయ

90 ఎం.ఎల్ తో కార్తికేయ
x
Highlights

'ఆర్ఎక్స్ 100' సినిమా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ లో ఒక్క సారిగా కార్తికేయ పేరు మారుమ్రోగింది. ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న కార్తికేయ ఇప్పుడు 'హిప్పీ'...

'ఆర్ఎక్స్ 100' సినిమా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ లో ఒక్క సారిగా కార్తికేయ పేరు మారుమ్రోగింది. ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న కార్తికేయ ఇప్పుడు 'హిప్పీ' అనే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. ఈ సినిమా కాకుండా కార్తికేయ చేతిలో మరొక మూడు సినిమాలు ఉన్నాయట. అందులో నాని 'గ్యాంగ్ లీడర్' సినిమా ఒక్కటి అయితే మిగతా రెండు కొత్త దర్శకులు అర్జున్ జంధ్యాల మరియు శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

తాజాగా కార్తికేయ హీరోగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు '90 ఎం.ఎల్' అనే టైటిల్ ను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తికేయ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడని, ఇది ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే తమిళంలో బిగ్ బాస్ ఫేమ్ ఓవియ కూడా '90 ఎం.ఎల్' అనే సినిమా చేసింది. ఆ సినిమా చాలా వివాదాలకు దారితీసింది కూడా. మరి కార్తికేయ కి ఈ టైటిల్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories