ఆరు గంటలు.. 30 ప్రశ్నలు.. రకుల్ ప్రీత్ సింగ్ ను ఉక్కిరి బిక్కిరి చేసిన ఈడీ

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 3 Sept 2021 9:16 PM IST
6 Hours, 30 Questions to Rakul at ED office
X

ఆరు గంటలు.. 30 ప్రశ్నలు.. రకుల్ ప్రీత్ సింగ్ ను ఉక్కిరి బిక్కిరి చేసిన ఈడీ

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఈడీ ముందుకు హాజరయ్యారు హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్. దాదాపు 6 గంటల పాటు రకుల్‌ను విచారించారు అధికారులు. ప్రధానంగా మనీ లాండరింగ్‌, ఆర్థిక లావాదేవీలపై ఇంటరాగేషన్‌ జరిగినట్టు తెలుస్తోంది. అనేక ప్రశ్నలకు రకుల్‌ నుంచి సమాధానాలు రాబట్టారు.

రకుల్‌కు సంబంధించిన మూడు బ్యాంక్‌ అకౌంట్ల వివరాలపై ఆరా తీసిన ఈడీ నవదీప్‌, కెల్విన్‌, రకుల్‌ మధ్య లావాదేవీలపై పలు ప్రశ్నలు సంధించారు. రకుల్‌ బ్యాంక్‌ అకౌంట్లను పరిశీలించారు. మధ్యాహ్నం ఈడీ అధికారులు ఏర్పాటు చేసిన భోజనాన్ని వద్దన్న రకుల్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచే లంచ్‌ తెప్పించుకున్నారు. భోజనం అనంతరం రకుల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ బ్యాంకు ఖాతాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈడీ అధికారులు.

ఇక F క్లబ్‌లో పార్టీ పై అధికారులు రకుల్‌కు పలు ప్రశ్నలు సంధించారు. రియా చక్రవర్తితో ఫ్రెండ్‌షిప్‌పై ఆరా తీశారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాలని సూచించగా ఎప్పుడు పిలిచినా వస్తానని రకుల్‌ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు పూరీ జగన్నాథ్‌, చార్మి, రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఈడీ విచారణకు హాజరుకాగా ఈ నెల 13న F క్లబ్‌ మేనేజర్‌తో పాటు నవదీప్‌ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. వారి విచారణ అనంతరం రకుల్‌ వ్యవహారంపై క్లారిటీకి రానున్నారు ఈడీ అధికారులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story