Aha Releases: జూన్‌లో "ఆహా" అనిపించే సినిమాలు ఇవే...!

Aha Releases: కరోనాతో థియేటర్లు మూతపడడంతో.. ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.

Venkata Chari
Updated on: 1 Jun 2021 5:56 PM IST
4 Movies Released in this June in Aha
X

ఆహాలో విడుదల కానున్న సినిమాలు (ఫొటో ట్విట్టర్)

Aha Releases: కరోనాతో థియేటర్లు మూతపడడంతో.. ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కొన్ని ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే, అచ్చతెలుగు ఓటీటీ అయిన 'ఆహా' లో జూన్‌లో వారానికో సినిమా విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు అల్లు అరవింద్ 'ఆహా' సిద్ధమైంది. ఇప్పటికే పలు సినిమాల‌తో పాటు వెబ్‌ సిరీస్‌లతో అలరిస్తోంది. ఇక జూన్‌లో నెలలో ఆహాలో అలరించనున్న సినిమాలేంటో చూద్దాం...

మలయాళ హిట్‌ మూవీ 'కాలా' జూన్ 4 న ఆహాలో రిలీజ్ కానుంది. టొవినో థామస్, సుమేశ్ మూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ యాక్షన్ డ్రామా.. ఈ ఏడాది మార్చి 25న థియేటర్లలో విడుదలైంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన కుక్క కారణంగా ఇద్దరు వ్యక్తుల నడుమ సాగే భావోద్వేగ సంఘటనల సమాహారమే 'కాలా'. ఓ కుక్క చనిపోయిన కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం.. వీరి నడుమ సాగే పలు సంఘటనలతో.. ముగింపు వరకూ నాన్ స్టాప్ యాక్షన్ తో అలరించనుంది.


రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ గా డైరెక్ట్‌గా ఆహాలో జూన్ 11న విడుదల కానున్న సినిమా 'అర్ధ శతాబ్దం'. ఈ సినిమాను రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై చిట్టి కిరణ్ రామోజు నిర్మించారు. ఇక సినిమాలో కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య ఇతర పాత్రల్లో నటించారు. ఈ మూవీని రవీంద్ర పుల్లే తెరకెక్కించాడు. థియేటర్లో విడుకాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్‌ వేవ్‌తో ఆగిపోయింది. ఎట్టకేలకు జూన్ 11న ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమైంది.


టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్ జూన్ 18 న ఆహాలో విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాను విద్యా సాగర్ తెరకెక్కించాడు. ఈ వెబ్ సిరీస్‌ను సురేష్ కృష్ణ నిర్మించగా, నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది.


మలయాళి మెగాస్టార్‌ మమ్ముట్టి తాజాగా నటించిన 'వన్‌' సినిమాను తెలుగులో తీసుకొచ్చేందుకు ఆహా సిద్ధమైంది. సంతోష్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 25న విడుదల కానుంది.



Venkata Chari

Venkata Chari

Next Story