Kollywood News: విజయ్ సేతుపతి పై 3 కోట్ల పరువు నష్టం దావా...

Kollywood News: విజయ్ సేతుపతి అసిస్టెంట్లు తనపై దాడి చేశారని అంటున్న మహా గాంధీ

admin1
Published on: 8 Dec 2021 2:43 PM IST
3 crore defamation suit against Vijay Sethupathi | Kollywood News
X

విజయ్ సేతుపతి పై పరువు నష్టం దావా వేసిన వ్యక్తి(ఫైల్-ఫోటో) 

Kollywood News: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లోనూ ఒక నటుడిగా తన సత్తా చాటిన విజయ్ సేతుపతి ప్రస్తుతం తన చేతుల్లో 15 సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి కి లక్షల మంది అభిమానులు ఉన్నారు. కానీ నవంబర్ 2న విజయ్ సేతుపతి కి విమానాశ్రయం లో ఒక చేదు అనుభవం ఎదురైంది.

ఆ టైంలో విజయ్ సేతుపతి పై చేయి కూడా చేసుకున్నట్లు కొన్ని కథనాలు సైతం వినిపించాయి. కానీ దాడి జరిగింది విజయ్ సేతుపతి మీద కాదు అని కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి.ఇక ఈ విషయం ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. విజయ్ సేతుపతి పై మూడు కోట్ల పరువు నష్టం దావా వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజానికి ఆ రోజు చెన్నై కి చెందిన మహా గాంధీ అనే వ్యక్తి మరియు అతని అసిస్టెంట్లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

విజయ్ సేతుపతి ని కలిసి అతని నటన గురించి మాట్లాడుతూ ఉంటే మధ్యలో అతని అసిస్టెంట్లు వచ్చి మహా గాంధీ పై చేయి చేసుకున్నట్లు, దాడి చేసినట్లు అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనివల్ల మానసికంగా చాలా దెబ్బతిందని పేర్కొన్న మహా గాంధీ విజయ్ సేతుపతి పై 3కోట్ల పరువు నష్టం దావా వేశారు. మరి అసలు జరిగిన నిజానిజాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందేనేమో.

admin1

admin1

Next Story