Tollywood: 'దృశ్యం 2' నుంచి 'జాంబి రెడ్డి 2' వరకు.. టాలీవుడ్‌లో సీక్వెల్స్ ఇవే

2021 Tollywood Movie Sequels
x

టాలీవుడ్ మూవీ సీక్వెల్స్ 

Highlights

Tollywood: బాహుబలి 2 వచ్చినా అది సీక్వెల్ కాదు.. ఒకే కథకు రెండో బాగం అంతే.

Tollywood: సీక్వెల్ తీయ‌డంలో బాలీవుడ్ తో పొలిస్తే.. ద‌క్షిణాది సిని ప‌రిశ్ర‌మ కాస్త వెన‌కంజ వెస్తుంద‌నే చెప్పాలి. టాలీవుడ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సీక్వెల్ పేరు చెబితే చాలు సినిమాపై ఆశ‌లు వ‌దులుకునే వారు. కొంద‌రూ దైర్యం చేసి ముందుకు వ‌చ్చిన క‌థ న‌చ్చ‌కో, లేక హీరో డేట్స్ అడ్జ‌స్ట్ కావ‌డం లేద‌నో వెన‌క‌డుగు వేస్తారు. బాహుబలి 2 వచ్చినా అది సీక్వెల్ కాదు.. ఒకే కథకు రెండో బాగం అంతే. అలాంటిది ఇప్పుడు బ్యాడ్ సెంటిమెంట్ పక్కనబెట్టి వరస సీక్వెల్స్ చేస్తున్నారు. దాదాపు 10 సినిమాలకు పైగా సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయిప్పుడు.


కెజియఫ్ 2: బాహుబలి మాదిరే కెజియఫ్ కూడా కొనసాగింపుగానే వస్తుంది కానీ సీక్వెల్ అనలేం. జులై 16న విడుదలవుతుంది కెజియఫ్ ఛాప్టర్ 2.


వెంట‌టేశ్ న‌టించిన దృశ్యం 2. మ‌ళ‌యాలంలో విజ‌యం సాధించిన దృశ్యం 2 కి ఇది తెలుగు రిమేక్. గ‌తంలో దృశ్యం -1 సూప‌ర్ హిట్ సార‌దిఃచిన విష‌యం తెలిసిందే


టాలీవుడ్‌లో ఎఫ్ 3 అంటూ సీక్వెల్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఆగస్ట్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. గతంలో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ఎఫ్ 2 కూడా ఉంటుంది.



ఢీ 2 ఢీ14 ఏళ్ల కింద వచ్చిన ఢీ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ శ్రీను వైట్ల ప్రకటించాడు. విష్ణు హీరోగా ఢీ 2 ఢీ ఈ సినిమా రాబోతుంది.




హిట్ ఫస్ట్ కేసులో హీరో విశ్వక్ సేన్ హీరోగా చేసాడు. నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హిట్ 2 రాబోతుంది




అడవి శేష్ హీరోగా వచ్చిన గూఢాచారి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గూఢాచారి2 చేస్తున్నాడు శేష్.



సోగ్గాడే చిన్నినాయనాకు సీక్వెల్ బంగార్రాజు పేరుతో ఈ చిత్రం రాబోతుంది.


కార్తికేయ 2: ఏడేళ్ల కింద వచ్చిన కార్తికేయ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు నిఖిల్‌తోనే సీక్వెల్ చేస్తున్నాడు చందూ మొండేటి.


జాంబి రెడ్డి 2: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలైంది. చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. ఇవే కాకుండా.. ఈ ఏడాది సూప‌ర్ హిట్ చిత్రాలు జాతిర‌త్నాలు, క్రాక్ సినిమాల‌కు కూడా సిక్వెల్ రాబోతుంద‌ని తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories