19 Years For Nuvvu Nenu : ఉదయ్ కిరణ్ 'నువ్వు నేను' కి 19 ఏళ్ళు!

19 Years For Nuvvu Nenu : ఉదయ్ కిరణ్ నువ్వు నేను కి 19 ఏళ్ళు!
x
Nuvvu Nenu ( File Photo)
Highlights

19 Years For Nuvvu Nenu : తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి ఓ ప్రభంజనం సృష్టించిన సినిమాలు చాలా తక్కువేనని చెప్పవచ్చు..

19 Years For Nuvvu Nenu : తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి ఓ ప్రభంజనం సృష్టించిన సినిమాలు చాలా తక్కువేనని చెప్పవచ్చు.. అలాంటి సినిమాలో టాప్ 3 లో ఉంటుంది ఉదయ్ కిరణ్ నటించిన ఈ 'నువ్వు నేను' సినిమా.. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 10, 2001వ సంవత్సరంలో రిలీజ్ అయి ఎవరు ఉహించని విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. ఈ సినిమాకి నేటికి 19 ఏళ్ళు నిండాయి.. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

* అప్పటివరకూ కెమెరామాన్ గా ఉన్న తేజ చిత్రం సినిమాతో దర్శకుడిగా మారి ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాడు.. దీనితో తేజ చూట్టూ చాలా ఆఫర్స్ ఉన్నాయి.. ఏకంగా వెంకటేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయింది..

* వెంకటేష్ తో అనుకున్న సినిమా క్యాన్సల్ అవ్వడంతో అదే నిర్మాతతో మరో సినిమాకి కమిట్ అయ్యాడు తేజ.. అదే నువ్వు నేను..

* ఈ సినిమాకి దశరథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన సహకారం అందించారు.

* ముందుగా సుమంత్ , మాధవన్ లతో ఈ సినిమాని చేయాలనీ అనుకున్నాడు తేజ.. కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ని ఫైనల్ చేశాడు తేజ..

* వంద మందితో హీరోయిన్స్ కోసం ఆడిషన్స్ పెట్టాడు తేజ.. అందులో ఒక్క అమ్మాయిని హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తే .. ఆ హీరోయిన్ కారు, హోటల్ అంటూ బిల్డప్ ఇచ్చిందట.. దీనితో తేజ మిగిలిన అమ్మాయిలలో ఎవరు చీప్ అని నీకు అనిపిస్తుంది అని అడగగా ఓ అమ్మాయిని చూపించిందట ఆ హీరోయిన్ .. అదే అమ్మాయిని హీరోయిన్ గా ఫైనల్ చేశాడు తేజ.. ఆమె అనిత

* హైదరాబాదు, ముంబై, వికారాబాద్ లో మొత్తం సినిమా షూటింగ్ చేశారు.

* సినిమా మొత్తంలో 11 పాటలు ఉన్నాయి. ఆర్పీ పట్నాయక్ పాటలకి సూపర్ రెస్పాన్స్.. గాజువాక పిల్ల పాట పెద్ద ట్రెండ్ ని క్రియేట్ చేసింది.

* సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసి ఆగస్టు 10, 2001లో రిలీజ్ చేశారు. ఫస్ట్ షో నుంచే సినిమాకి అదిరిపోయే టాక్ వచ్చింది. మొత్తం ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్.. యూత్ మొత్తం ధియేటర్లలోనే..

* సినిమాలో " మీ పెద్దోల్లున్నారే " అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది.

* ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అయిపోయాడు.. ఈ సినిమాతో ఉదయ్ ఏకంగా అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.

* ఈ సినిమాతో తేజ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.. ఆర్పీ పట్నాయక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. లిరిక్ రైటర్ కులశేఖర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలంగాణ శకుంతలకి స్టార్ బ్రేక్ ఇచ్చింది నువ్వు నేను..

* దాదాపుగా కోటి యాబై లక్షలతో ఈ సినిమాని తెరకెక్కిస్తే...20 కోట్ల వరకూ సాధించిపెట్టింది ఈ చిత్రం..

* నరసింహనాయుడు, ఖుషి, నువ్వే కావాలి తర్వాత ఒక్క ధియేటర్ లోనే కోటి రూపాయలను వసూళ్ళును సాధించింది ఈ సినిమా..

* మొత్తం 70 కేంద్రాలలో వంద రోజులు ఆడింది...

* ఈ సినిమాకి మొత్తం అయిదు నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఐదు నంది పురస్కారాలు దక్కాయి. నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కూడా దక్కాయి.

* ఈ చిత్రం హిందీలో యే దిల్ (2003), తమిళంలో మదురై వీరన్ (2007) మరియు బెంగాలీలో డుజోన్ (2009) గా రీమేక్ చేయబడింది . హీరోయిన్ అనిత హిందీ వెర్షన్‌లో తన పాత్రను తిరిగి పోషించారు.

* ఉదయ్ కిరణ్ భౌతికంగా మన మధ్య లేకపోయిన నువ్వు నేను సినిమా రూపంలో ఎప్పటికి బతికే ఉంటాడు.




Show Full Article
Print Article
Next Story
More Stories