18 Years for Megastar Indra Movie : మెగాస్టార్ 'ఇంద్ర' కి 18 ఏళ్ళు!

18 Years for Megastar Indra Movie : మెగాస్టార్ ఇంద్ర కి 18 ఏళ్ళు!
x
18 Years of Megastar Indra Movie
Highlights

18 Years complete for Megastar Indra Movie: గ్యాంగ్ లీడర్ , ఘరానా మొగుడు సినిమాల తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా రోజులైంది. అంతేకాకుండా చిరంజీవి నుంచి మంచి

18 Years of Megastar Indra Movie :గ్యాంగ్ లీడర్ , ఘరానా మొగుడు సినిమాల తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా రోజులైంది. అంతేకాకుండా చిరంజీవి నుంచి మంచి మాస్ సినిమా వచ్చి కూడా చాలా రోజులైంది. అభిమానులకి ఈ సారి హిట్ కాదు. ఇండస్ట్రీ హిట్ కావాలి. కొడితే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవాలి. ఈ తరుణంలో దర్శకుడు జయంత్ తో ఓ సినిమాని కమిట్ అయ్యాడు చిరంజీవి.. కానీ అది ఓ ఫ్యామిలీ స్టొరీ.. నో ఈ టైంలో చేయాల్సింది పక్కా మాస్ మూవీ అనుకోని ఆ కథను పక్కన పెట్టేసి సీ అశ్వినీదత్ ని కాంటాక్ట్ అయ్యాడు చిరు..

అప్పటికే అశ్వినీదత్ కి మంచి టచ్ లో ఉన్న చిన్ని కృష్ణను కథ అడగగా రాయలసీమ, కాశీ నేపధ్యంలో ఓ కథను వినిపించారు.కథకి ఫిదా అయిపోయిన చిరు ఇది తనకి సూట్ అవుతుందా లేదా అని ముందుగా అనుమానపడ్డారట.. ఆ తర్వాత కథను డెవలప్ చేసే పనిని మెగాస్టార్ తన ఆస్థాన రచయితలు పరిచురి బ్రదర్స్ కి అప్పగించారు. అయితే ఈ కథను జయంత్ హ్యాండిల్ చేస్తాడా.. లేదు అనుకోని ఫ్యాక్షన్ మూవీస్ స్పెషాలిట్ బి గోపాల్ ని తీసుకున్నారు. అంతకుముందు చిరంజీవి బి గోపాల్ కాంబినేషన్ లో మెకానిక్ అల్లుడు సినిమా వచ్చింది కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

అయితే ఈ సారి పక్కా ఫ్యాక్షన్ మూవీ కావడంతో బి. గోపాల్ పక్కా హిట్ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక సినిమా మొత్తాన్ని ఫినిష్ చేసి 24 జూలై 2002 న విడుదల చేయగా సినిమాకి ఎక్కడలేని క్రేజ్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ సినిమాకి 18 ఏళ్ళు పూర్తి అయిపోయాయి. సో ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

ముందుగా ఈ సినిమాకి సిమ్రాన్ ని హీరోయిన్ గా తీసుకుందాం అని అనుకున్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నారు. మరో హీరోయిన్ గా సోనాలి బింద్రేని ఫైనల్ చేశారు.

ఇక శివాజీ పాత్రకు ముందుగా వెంకట్ , రాజా మొదలుగు వారిని అనుకున్నారు కానీ ఆ పాత్ర శివాజీకి దక్కింది.

చిరంజీవి రెమ్యునరేషన్ ని పక్కన పెడితే ఈ సినిమాకి అయున బడ్జెట్ ఏడూ కోట్లు..

చిరంజీవి, వైజయంతి బ్యానర్ లో మూడో సినిమా.. అంతకుముందు జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది సినిమాలు వచ్చాయి. ఇక ఇంద్రతో హ్యాట్రిక్ కొట్టి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని నిరూపించారు.

మొత్తం 120 రోజుల్లో సినిమాని ఫినిష్ చేశారు.

మొత్తం పదకొండు పాటలకి చేయగా అందులో అయిదు పాటలని ఒకే చేశారు. ఇందులో అయ్యో అయ్యో సాంగ్ ని మణిశర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్పీ పట్నాయక్ తో మ్యూజిక్ చేయించుకున్నారు.

మొత్తం 268 స్క్రీన్‌లలో ఇంద్ర సినిమాని రిలీజ్ చేశారు. ఇందులో 151 కేంద్రాల్లో 50 రోజులు,98 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాలలో 175 రోజులు ఆడింది.

ఇక అడోనిలోని సత్యం థియేటర్‌లో 227 రోజులు పాటు ఆడింది ఇంద్ర సినిమా..

మొత్తం ఈ సినిమాకి మూడు క్యాటగిరిలలో నంది అవార్డులు వచ్చాయి.

ఉత్తమ నటుడు - చిరంజీవి

ఉత్తమ కొరియోగ్రాఫర్ - రాఘవ లారెన్స్ - "ధాయ్ ధాయి ధామా"

ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్ - పి రవి శంకర్

ఫస్ట్ వీక్ 40 కోట్లు వసూళ్ళు సాధించిన తొలి తెలుగు సినిమా ఇంద్ర కావడం విశేషం.. ఆ తర్వాత పోకిరి సినిమా దీనిని బ్రేక్ చేసింది.

విజయవాడలో 175 రోజుల ఫంక్షన్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి చీఫ్ గెస్ట్.

ఈ చిత్రాన్ని హిందీలోకి "ఇంద్ర: ది టైగర్" గా, బెంగాలీలో సుల్తాన్ గా రీమేక్ చేశారు.

మొత్తం ఈ సినిమా 55 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టిందని అంచనా..

Show Full Article
Print Article
Next Story
More Stories