16 Years for Pokiri: 'పోకిరి' ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసిన హీరోయిన్స్‌ వీళ్లే!

16 Years for Pokiri: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో "పోకిరి" సినిమాని ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు.

Arun Chilukuri
Updated on: 28 April 2022 5:30 PM IST
16 Years for Mahesh Babus Pokiri Movie
X

16 Years for Pokiri: 'పోకిరి' ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసిన హీరోయిన్స్‌ వీళ్లే!

16 Years for Pokiri: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో "పోకిరి" సినిమాని ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అభిమానులకు కన్నుల విందు చేశారు. పలు కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా ఆడిన ఈ సినిమా 2006 ఏప్రిల్ 28న విడుదలైంది. నేటికి ఈ సినిమా 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హాట్ బ్యూటీ ఇలియానా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ముందుగా పోకిరి సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సంప్రదించారట.

కానీ అప్పటికే ఆమె "గ్యాంగ్‌స్టర్‌" అనే సినిమాతో బిజీగా ఉండటంతో ఈ సినిమాకి డేట్లు కుదరక నో చెప్పిందట. ఆ తర్వాత ఆయేషా టాకియా, పార్వతీమెల్టన్, దీపికా పడుకొనే వంటి కొందరు హీరోయిన్లకు ఈ అవకాశం దొరికింది కానీ వారు కూడా పలు కారణాల వల్ల ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ గోల్డెన్ ఆఫర్ ఇలియానా కి దక్కింది. ఇలియానా కెరీర్లో పోకిరి రెండో సినిమానే అయినప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం తో ఇలియానాకు వరుసగా బోలెడు ఆఫర్లు వచ్చి పడ్డాయి. నిజానికి పోకిరి సినిమా తర్వాతే ఇలియానా కి స్టార్ స్టేటస్ కూడా వచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story