15 Years For Athadu : పదిహేనేళ్ళు అయినా 'అతడు' సినిమాకి ఇప్పటికీ అదే జోరు!

15 Years For Athadu : పదిహేనేళ్ళు అయినా అతడు సినిమాకి ఇప్పటికీ అదే జోరు!
x
15 Years For Athadu movie
Highlights

15 Years For Athadu : అప్పటివరకూ మహేష్ బాబు చేసిన సినిమాలు ఒకెత్తు... ఈ సినిమా ఒకెత్తు.. ఎందుకంటే అప్పటివరకు మహేష్ బాబు సినిమాలన్నీ

15 Years For Athadu : ఏదైనా ఒక సినిమా ఒకసారి చూస్తారు.. రెండు సార్లు చూస్తారు.. లేదా ఓ నాలుగైదు సార్లు చూస్తారు. కానీ, ఆ సినిమాని మాత్రం పదిహేనేళ్ళ నుంచి ఎన్నిసార్లు టీవీలో ప్రసారం చేసినా.. ఇప్పటికీ జనం చూస్తూనే ఉన్నారు. ఆ సినిమాని ఎన్నిసార్లు చూసావు అని ఎవరినైనా అడిగితె వాళ్ళు ఇచ్చే సమాధానం లెక్కలేనన్ని సార్లు! అని వస్తుంది. కలెక్షన్ల రికార్డులు.. శతదినోత్సవాల కేంద్రాలు ఇలాంటి లెక్కలకు ఈ సినిమా అతీతం. అది త్రివిక్రముడు సెల్యులాయిడ్ రాజకుమారుడితో చేసిన మేజిక్! అదే అతడు సినిమా..

అప్పటివరకూ మహేష్ బాబు చేసిన సినిమాలు ఒకెత్తు... ఈ సినిమా ఒకెత్తు.. ఎందుకంటే అప్పటివరకు మహేష్ బాబు సినిమాలన్నీ ఓ మూసధోరణిలోనే వెళ్తున్నాయి.. అందులోనూ మురారి సినిమా తర్వాత మళ్ళీ ఫ్యామిలీ కథలను ఎప్పుడు టచ్ చేయలేదు మహేష్.. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ఈ అతడు సినిమా 2005 ఆగస్టు 10 న విడుదలై అని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమాకి నేటితో 15 ఏళ్ళు నిండాయి.. అలాంటి అతడు సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

* అప్పటివరకూ రచయితగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇద్దామని అనుకున్నాడు.. అందులో భాగంగానే ఈ కథను ముందుగా పవన్ కళ్యాణ్ కి వెళ్లి చెప్పగా అయన కథ వింటూ నిద్రపోయారట..

* ఆ తర్వాత ఇదే కథని మహేష్ బాబుకి చెబితే మహేశ్ కి బాగా నచ్చిందట.. కానీ అప్పటికే అర్జున్, నాని సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ నెక్స్ట్ ఇయర్ చేద్దామని చెప్పాడట.. అప్పటిలోపు ఓ సినిమా చేయండి అని సలహా కూడా ఇచ్చాడట..

* దీనితో త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మహేష్ తో సినిమాని స్టార్ట్ చేశాడు త్రివిక్రమ్..

* ముందుగా ఈ సినిమాని పద్మాలయా బ్యానర్ పైనే సినిమా తీద్దామని వారు భావించారు హీరో కృష్ణ.. కానీ త్రివిక్రమ్ టాలెంట్ ని ముందే గుర్తించిన నటుడు, వ్యాపారవేత్త, నిర్మాత మురళీ మోహన్ తన జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ ఇవ్వడంతో ఈ సినిమా కృష్ణకి మిస్ అయింది.

* మహేష్ బాబు పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ సినిమా అతడు..

* ఇందులో నాజర్ పాత్రకి ముందుగా శోభన్ బాబు అనుకున్నారు మురళీమోహన్, త్రివిక్రమ్.. అందగాడిగా అందరు మెచ్చుకునే తానూ ముసలి పాత్రలో నటించడం ఇష్టం లేకా ఈ సినిమాని ఒప్పుకోలేదట.. ఇక ఆ పాత్రను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పి ఆ పాత్రకి ప్రాణం పోశారు.

* ఇందులో హీరోయిన్ పేరు పూరి.. త్రివిక్రమ్ ఇంటిపక్కన ఉండే ఓ అమ్మాయి పేరు పూర్ణిమ.. ఆమెను అందరూ పూరి అని పిలిచేవారట.. అది బాగా నచ్చి ఇందులో హీరోయిన్ కి అదే పేరు పెట్టేశాడట త్రివిక్రమ్..

* ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల కోసం టైమ్-ఫ్రీజ్ ఎఫెక్ట్ షాట్లను వాడారు..యాక్షన్ సన్నివేశాలను పీటర్ హీన్ పర్యవేక్షణలో ఈ సన్నివేశాలను తెరకెక్కించారు.

* అప్పట్లో ఎక్కువ డీవీడీలు అమ్ముడు పోయిన సినిమా కూడా అతడునే .. అందుకు గాను ఉత్తమ డివిడి అవార్డును అందుకుంది ఈ చిత్రం..

* మొత్తం ఈ సినిమా 205 కేంద్రాల్లో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.. ఇక హైదరాబాద్ లోని సుదర్శన్ 35 మిమీలో 175 రోజులు ఆడింది..

* దాదాపుగా ఈ చిత్రం 40 కోట్లను కొల్లగొట్టింది.

* ఈ సినిమా విడుదలైన ఏడూ సంవత్సరాల తర్వాత మాటీవీ అతడు సినిమా శాటిలైట్ రేనివల్ కోసం ఏకంగా 3.5 కోట్లు చెల్లించింది. ఇది అప్పట్లో సెన్సేషన్..

* ఈ సినిమా తమిళంలో నందు అనే పేరుతో, మలయాళంలో టార్గెట్ అనే పేరుతో అనువాదం అయింది. హిందీలో ఏక్ అనే పేరుతోనూ, బెంగాలీలో వాంటెడ్ పేరుతో పునర్మించారు.

* పోలండ్ భాషలో విడుదలైన మొదటి తెలుగు సినిమా కూడా అతడు కావడం విశేషం..

* ఈ సినిమాకి ఉత్తమ నటుడుగా మహేష్ బాబు, ఉత్తమ మాటల రచయితగా త్రివిక్రమ్ నంది అవార్డులను అందుకున్నారు.

* వెండితెరపై కంటే బుల్లితెర పైన ఎక్కువ ప్రభంజనం సృష్టించింది ఈ చిత్రం..




Show Full Article
Print Article
Next Story
More Stories