Kajal Aggarwal : చందమామ ఖాతాలో మరో రికార్డు!

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు.. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అవుతున్న ఇంకా సినిమాలతో

Krishna
Published on: 6 Sept 2020 12:31 PM IST
Kajal Aggarwal : చందమామ ఖాతాలో మరో రికార్డు!
X

 Kajal Aggarwal

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు.. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అవుతున్న ఇంకా సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు.. సినిమాలతో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న కాజల్ తాజాగా మరో రికార్డు సృష్టించింది. తాజాగా కాజల్ అగర్వాల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 15 మిలియన్లు క్రాస్ అయింది. దీంతో ఈ ఫీట్ అందుకున్న అతి తక్కువ మంది హీరోయిన్ లలో కాజల్ పేరు సంపాదించుకుంది. ఫేస్‌బుక్‌లో ఆమెకు 2.34 కోట్ల మంది ఫాలోవర్లు మరియు ట్విట్టర్‌లో మరో 4.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది కాజల్ అగర్వాల్.. ఇక మగధీర చిత్రం కాజల్ ని స్టార్ హీరోయిన్ ని చేసింది .ఆర్య 2, బాద్షా, నాయక్, ఖైది నెంబర్ 150 చిత్రాలు కాజల్ కి మంచి పేరును తీసుకువచ్చాయి. ప్రస్తుతం కాజల్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా తమిళంలో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'భారతీయుడు 2'లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోసగాళ్ళు అనే చిత్రంలో కూడా కాజల్ కీలక పాత్ర పోషిస్తుంది.

Krishna

Krishna

Next Story