11 Years for Magadheera: జక్కన్న మగధీరకి 11 ఏళ్ళు!

Magadheera movie completed 11 years
x
Ramcharan and Kajol in Magadheera movie (File Photo)
Highlights

11 Years for Magadheera:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. మొదటి సినిమాలోనే

ఒక్కో సినిమా చరిత్ర సృష్టిస్తుంది. ఒక్కో సినిమా(11 Years for Magadheer:) విమర్శకుల ప్రశంశలతో కలకాలం నిలిచిపోతుంది. ఒక్కో సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.. ఒక్కో సినిమా మరో పెద్ద సినిమా కు పునాదిగా మారిపోతుంది. ఒక్కో సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టిస్తుంది. ఇలా ఎదో ఒక రకంగా లేదా రెండు రకాలుగా విజయవంతవుతాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం పైన చెప్పుకున్న అన్ని విధాలుగానూ ఒక ఊపు ఊపేస్తాయి. సంవత్సరాలు గడిచిపోయినా ఆ సినిమా దర్శకుడు.. నటీనటులు తమ జీవితంలో మర్చిపోలేని స్థాయి సినిమాగా మిగిలిపోతుంది. అటువంటి సినిమా మగధీర! అప్పుడప్పుడే వెండితెరపై తన ప్రస్తానం మొదలు పెట్టిన మెగా వారసుడు.. ఏడు వరుస విజయాల్తో ఊపుమీదున్న దర్శకుడు..ఖర్చుకు వెనుకాడని నిర్మాత.. వీరంతా కలిస్తే చరిత్ర సృష్టించడం కష్టం కాదు. కానీ, తెలుగు సినీ చరిత్రలో కానీ వినీ ఎరుగని సంచలనం సృష్టించారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. మొదటి సినిమాలోనే డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విషయాల్లో ప్రూవ్ చేసుకున్నాడు చరణ్.. అయితే ఇప్పుడు చరణ్ కి ఇండస్ట్రీ హిట్ కొట్టే సినిమా కావాలి. అదే టైంలో రాజమౌళితో సినిమాని అనౌన్స్ చేశారు చిరంజీవి.. అలా చరణ్, రాజమౌళి కాంబోలో మగధీర అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని భారీ బడ్జెట్, భారీ అంచనాల మధ్య 2009 జులై 31న విడుదల చేస్తే ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాంటి మగధీరకి నేటికి 11 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

¨ముందుగా చరణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రాజమౌళికే వచ్చింది. అయితే ఫస్ట్ సినిమా అయితే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి సెకండ్ సినిమా చేస్తానని రాజమౌళి చెప్పాడట..

¨♦ ఈ సినిమా కథ రచయిత కె.వి.విజేంద్ర ప్రసాద్ మరాఠీ చిత్రం ఆధారంగా చేసుకొని ఈ సినిమాని రూపొందించారు. ఈ కథని విజేంద్ర ప్రసాద్ 15 ఏళ్ల క్రితమే రాసుకున్నారట.. చరణ్ తో సినిమా కోసం రాజమౌళి ఈ కథను ఎంచుకున్నారు. కన్నడ చిత్రం రాజా నన్నా రాజా చిత్రం నుంచి కూడా ఈ సినిమా కోసం ప్రేరణను పొందారు.

¨♦ ముందుగా యమదొంగ సినిమా కోసమే కాజల్ ని తీసుకోవాలని అనుకున్నాడట రాజమౌళి..కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ప్రియమణిని తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ సినిమా కోసం కాజల్ ని తీసుకున్నాడు రాజమౌళి ..

¨♦ ఈ సినిమా కోసం చిరంజీవి ఘరానా మొగుడు సినిమా నుంచి వచ్చిన "బంగారు కొడిపెట్ట" సాంగ్ ని రీమేక్ చేశారు.

¨♦ ఈ పాటకోసం చిరంజీవి ప్రత్యేక పాత్రలో కనిపించారు. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అయన మళ్ళీ సినిమాల్లో కనిపించడం ఇదే మొదటిసారి..

¨♦ 90 శాతం షూటింగ్ ని రాజస్తాన్, గుజరాత్ లలోనే తెరకెక్కించారు.

¨♦ మొదటిగా ఈ సినిమా టైటిల్ కోసం బైరవ, గరుడ మొదలగు టైటిల్స్ అనుకున్నారు. కానీ ఫైనల్ గా మగధీరని ఫైనల్ చేశారు.

¨♦ 26 ఫిబ్రవరి 2008న షూటింగ్ ని మొదలు పెట్టి 2009 జులై 31న సినిమాని విడుదల చేశారు.

¨♦ మొత్తం 1000 కేంద్రాలలో ఈ సినిమాని విడుదల చేశారు. అన్ని కేంద్రాలలో విడుదలైన ఫస్ట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం..

¨♦ థియేటర్ల వద్ద మగధీర సినిమా టిక్కెట్ల కోసం కొట్టుకొని చనిపోయిన సందర్బాలు కూడా ఉన్నాయి.

¨♦ ఈ సినిమా మొత్తం 100 కోట్లకి పైగా షేర్ ని వసూళ్లు సాధించింది. కొన్ని సెంటర్లలో ఇప్పటికి మగధీర రికార్డు అలాగే ఉంది.

¨♦ ఈ చిత్రం 223 కేంద్రాల్లో 100 రోజులు, 3 కేంద్రాలలో 175 రోజులు, 302 కేంద్రాల్లో 50 రోజులను పూర్తి చేసుకుంది.

¨♦ ఒక్క కర్నూలులోని విజయలక్ష్మి థియేటర్‌లోనే 365 రోజుల పాటు ఆడింది ఈ సినిమా..

¨♦ ఉత్తమ నృత్య దర్శకుడిగా కె.శివశంకర్ మాస్టర్ , ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అందించినందుకు గాను కనల్ కణ్ణన్ లకు జాతీయ చలన చిత్ర పురస్కారాలు లభించాయి.

¨♦ ఈ చిత్రం ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు , తొమ్మిది నంది అవార్డులు మరియు పది సినీ'మా' అవార్డులను కూడా గెలుచుకుంది.

¨♦ ఇది రాజమౌళికి ఏడో చిత్రం కావడం విశేషం..

Show Full Article
Print Article
Next Story
More Stories