బాలకృష్ణ 'అఖండ 2 – తాండవం' టీజర్ హంగామా: 24 గంటల్లో 24 మిలియన్ల వ్యూస్, అభిమాని ఫోన్ కాల్ వైరల్


బాలకృష్ణ 'అఖండ 2 – తాండవం' టీజర్ హంగామా: 24 గంటల్లో 24 మిలియన్ల వ్యూస్, అభిమాని ఫోన్ కాల్ వైరల్
బాలకృష్ణ ‘అఖండ 2 – తాండవం’ టీజర్ విడుదలైంది. 24 గంటల్లో 24 మిలియన్ల వ్యూస్ సాధించిన టీజర్, అభిమానితో బాలయ్య ఫోన్ సంభాషణతో మరోసారి వైరల్ అయ్యింది. సెప్టెంబర్ 25న సినిమా థియేటర్లలోకి వస్తోంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2 – తాండవం’ టీజర్ మాస్ మాద్యమాల్లో అఖండ హవాను కొనసాగిస్తోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
24 గంటల్లో 24 మిలియన్ల వ్యూస్ – టీజర్‌కు మాస్ రెస్పాన్స్
బాలయ్య చెప్పిన “నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా?” వంటి డైలాగులు అభిమానుల్లో పుల్ ఎనర్జీకి కారణమవుతున్నాయి. కేవలం 24 గంటల్లో యూట్యూబ్‌లో 24 మిలియన్ల వ్యూస్ సాధించి ఈ టీజర్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. బోయపాటి మార్క్ టేకింగ్, బాలకృష్ణ యాక్షన్, విజువల్స్, థమన్ నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను పెంచాయి.
అభిమాని ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్
అఖండ 2 టీజర్‌పై అభిమానుల్లో సందడి కొనసాగుతుండగా, అనంతపురం జిల్లా అభిమానితో బాలకృష్ణ చేసిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానిగా జగన్ మాట్లాడుతూ, “ఇది అరాచకం సార్, మీ లుక్ ఎన్టీఆర్ గారి 'దాన వీర శూరకర్ణ'ను తలపిస్తుంది. ఆల్ ఇండియాలో ఇంత లుక్ ఎవ్వరూ ఇవ్వలేరు” అంటూ భావోద్వేగంతో స్పందించాడు.
బాలయ్య స్పందన: "డౌట్ ఏంటి..? రికార్డులు ఖాయం!"
ఈ ఫోన్ సంభాషణలో బాలయ్య కూడా తన ఆనందాన్ని పంచుకుంటూ, "డౌట్ ఏంటి.. అభిమానుల ఆశీర్వాదంతో రికార్డులు ఖాయం" అంటూ ధీమా వ్యక్తం చేశారు. అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా టీజర్‌ను తిరిగి తిరిగి చూస్తున్నారని, రాత్రంతా నిద్ర లేకుండా చూస్తున్నారని ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 25న 'అఖండ 2 – తాండవం' థియేటర్లలోకి
'అఖండ'కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం, సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల కానుంది. టీజర్ ద్వారా భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.
- Jai Balayy
- Balakrishna Akhanda 2 Teaser
- Akhanda 2 Release Date
- Boyapati Srinu Movie
- Telugu Action Movies 2025
- Balakrishna Viral Call
- Dasara Movie Releases
- Balakrishna
- NBK
- Nandamuri Balakrishna
- Akhanda
- Akhanda 2
- Balakrishna Teaser
- NBK Fans
- Boyapati Srinu
- Akhanda Tandavam
- NBK Birthday
- NBK Mass
- Telugu Cinema
- Tollywood News
- Balakrishna Dialogue
- NBK On Fire
- Dasara Release
- Akhanda 2 Teaser
- Akhanda Records
- Balakrishna Mass Look
- NBK Blockbuster

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



