Vishwak Sen: 'ధమ్కీ' రివ్యూ.. రెండు పాత్రల్లో పాతుకుపోయిన విశ్వక్ సేన్..

Vishwak Sen: విశ్వక్ సేన్, నివేదా పెతురాజ్ కాంబినేష్ లోతెరకెక్కిన మూవీ ధాస్ కి ధమ్కీ.

Arun Chilukuri
Updated on: 22 March 2023 2:07 PM IST
Vishwak Sen Das Ka Dhamki Movie Movie Review
X

Vishwak Sen: ‘ధమ్కీ’కి రివ్యూ.. రెండు పాత్రల్లో పాతుకుపోయిన విశ్వక్ సేన్..

Vishwak Sen: విశ్వక్ సేన్, నివేదా పెతురాజ్ కాంబినేష్ లోతెరకెక్కిన మూవీ ధాస్ కి ధమ్కీ. డ్యూయెల్ రోల్ లో కనిపించటమే కాదు, నటుడిగా, దర్శకుడిగా డ్యూయెల్ టాస్క్ కూడా తీసుకున్నాడు విశ్వక్ సేన్. మరి ఈ ప్రయోగం వర్కవుట్ అయ్యిందా? ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? విశ్వక్ సేన్ సినిమా సినిమాకు వేరియేషన్ తో ఎమోషన్ క్యారీ చేస్తున్నాడు. ఇప్పుడు ధాస్ కి ధమ్కీ అంటూ మార్ రూట్లో కూడా ఎక్స్ పరిమెంట్ చేశాడు. డబుల్ ఫోటో కాన్సెప్ట్ తో దండెత్తాడు.

ఓ మిడిల్ క్లాస్ హీరో, రిచ్ లైఫ్ కోరుకోవటం.. తనలాంటి మరో వ్యక్తి రిచ్ అవటంతో, తన పాత్రలోకి ఈ హీరో వెల్లటం ఇవేవి కొత్త పాయింట్లు కావు.. కాని అదే కాన్సెప్ట్ ని ఢిఫరెంట్ స్క్రీన్ ప్లేతో నెరేట్ చేసే సాహసం చేశాడు విశ్వక్ సేన్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారీ రిస్కే చేశాడు. దాస్ కి ధమ్కీలో రెండు విభిన్న పాత్రల్లో పాతుకుపోయిన విశ్వక్ సేన్ నటనటతో మరోమెట్టు పైకెక్కాడు. నివేద కూడా తన పాత్ర మేరకు బానే ఆకట్టుకుంది. ఈమూవీ మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేస్తోంది.

విశ్వక్ సేన్ దర్శకుడిగా కూడా ఫలక్ నుమా దాస్ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు దాస్ కి ధమ్కీతో మరోసారి సాహసం చేశాడు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చాలా పెద్ద రిస్క్ చేసి ఆవిషయంలో కొంతవరకు విజయం సాధించాడనే అంటున్నారు. రంగమార్ధాండతో పోటీ అనలేం కాని, ఆ జోనర్ ఆరూట్లో హిట్ మెట్టెక్కితే, ధాస్ కి ధమ్కీ ఈ రూట్లో హిట్ మెట్లెక్కేలా ఉంది. ఫైనల్ టాక్ కిక్ ఇస్తోంది. పాజిటివ్ టాక్ పెరుగటంతో లెక్క మారేలా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story