Balloon Movie Review: బెలూన్ సినిమా రివ్యూ

Balloon Movie Review: బెలూన్ సినిమా రివ్యూ
x
Balloon Movie Review
Highlights

Balloon Movie Review: కరోనా నేపథ్యంలో ధియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Balloon Movie Review: కరోనా నేపథ్యంలో ధియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కీర్తి సురేష్ పెంగ్విన్, సిద్దు హీరోగా నటించిన కృష్ణ అండ్ హీజ్ లీలా, నవీన్ చంద్ర భానుమతి & రామకృష్ణ మొదలగు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకున్నాయి. అందులో భాగంగానే జై, అంజలి కలిసి నటించిన బెలూన్ సినిమాని కూడా జూలై 10న జీ5 యాప్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. వాస్తవానికి అయితే ఈ చిత్రం ధియేటర్ లో ఎప్పుడో రిలీజ్ అవ్వాలసింది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఈ సినిమా.. ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపించడంతో ఈ సినిమాని కూడా ఓటీటీలోనే రిలీజ్ చేశారు మేకర్స్..

ఇక కథ విషయానికి వచ్చేసరికి.. జై (జీవ) దర్శకుడు ఆ కావాలనే ఉద్దేశంతో ఉంటాడు.. అందులో భాగంగానే కథ అన్వేషణలో ఉంటాడు. ఇందుకోసం తన భార్య జాక్వలిన్ (అంజలి), స్నేహితుడు పాండా (యోగిబాబు)తో కలిసి అరకు వెళ్తాడు. అక్కడ ఉన్న ఓ ఇంటి గురించి తెలుసుకోవాలని అంటాడు. ఈ క్రమంలో వారికి కొన్ని అనుకోని ఇబ్బందులు ఏర్పడుతాయి.. అంతేకాకుండా మధ్యమధ్యలో బెలూన్లు కూడా వారిని ఇబ్బంది పెడతాయి.. అయితే ఆ సమస్య నుంచి వారు ఎలా బయటపడ్డారు అన్నది మిగిలిన ఆ కథ..

ఎలా ఉందంటే?

ఇప్పటివరకు హారర్ కామెడీ చిత్రాలు బాగానే వచ్చాయి.. ఇవే సక్సెస్ ఫార్ములా చిత్రాలు కూడా.. ఇదే తరహా కథాంశంతో తెరకెక్కింది ఈ బెలూన్ చిత్రం.. మొదటిభాగం కామెడీతో పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. అయితే సెంకండాఫ్ కే ఈ సినిమాలో బోర్ దెయ్యం పట్టింది. అందులోనూ 2017లో తమిళంలో వచ్చిన ఈ సినిమా ..ఈ కాలం కరోనా ప్రేక్షకులకు ఎక్కడం కష్టమే అని చెప్పాలి. ఇలాంటి జోక్స్ ఇప్పటికే మన ప్రేక్షకులు చూశారు కూడా.. అంతేకాకుండా సెంకండాఫ్ కూడా బాగా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఇక క్లయిమాక్స్ కూడా అంతగొప్పగా ఏమి అనిపించదు.. మొత్తానికి చెప్పాలంటే పాత చింతకాయ పచ్చడే అని చెప్పవచ్చు..

నటీనటులు :

జై, అంజలి నటన పాత్రల మేరకు పర్వాలేదు అనిపిస్తుంది. ఇక యోగిబాబు మాత్రం నవ్వించడానికి బాగానే ప్రయత్నించాడు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం :

ఓ హారర్ సినిమాకి అయితే ఉండాల్సిన కెమెరా వర్క్ ఈ సినిమాకి లేదనే చెప్పాలి.. అక్కడక్కడా వచ్చే జంప్ స్కేర్ షాట్స్ తప్ప ఆడియన్స్ ను థ్రిల్ చేయగలిగే ఒక్క కెమెరా యాంగిల్ & షాట్ సినిమా మొత్తంలో లేదనే చెప్పాలి. ఇక బాక్గ్రౌండ్ స్కోర్ కూడా గొప్పగా ఎం లేదు. పాటలు పర్వాలేదు అనిపిస్తుంది.. ఇక దర్శకుడు శినిష్ ప్రయత్నం అబ్బురపరిచే విధంగా అయితే ఏమీ లేదు..

Show Full Article
Print Article
Next Story
More Stories