రివ్యూ: క‌ల‌ర్ ఫోటో

రివ్యూ: క‌ల‌ర్ ఫోటో
x
Highlights

దసరా అంటే సినిమా ఇండస్ట్రీకి ఓ పెద్ద పండగ.. ఈ టైంలో సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇప్పడు కరోనా వచ్చి అంతా తలకిందులు చేసింది. పెద్ద హీరోల సినిమాలు లేవు.. కొత్త సినిమాలు వైపు ఇప్పుడు ప్రేక్షకుడు ఓటీటీ వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

దసరా అంటే సినిమా ఇండస్ట్రీకి ఓ పెద్ద పండగ.. ఈ టైంలో సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇప్పడు కరోనా వచ్చి అంతా తలకిందులు చేసింది. పెద్ద హీరోల సినిమాలు లేవు.. కొత్త సినిమాలు వైపు ఇప్పుడు ప్రేక్షకుడు ఓటీటీ వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఈ రోజు కలర్ ఫోటో చిత్రం `ఆహా` ఓటీటీ‌లో ఈ రోజు రిలిజైంది. ఇంతకి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం..

కథ :

1997లో జరిగే కథ ఇది.. జయకృష్ణ (సుహాస్‌) అనే ఓ కుర్రాడు మచిలీపట్నం దగ్గర ఓ మూరుమూల గ్రామంలో చాలా కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. ఓ రోజు తానూ చదువుకునే కాలేజీలో కల్చరల్‌ రిహార్సల్స్‌లో భాగంగా అమ్మవారి వేషంలో ఉన్న దీప్తి వర్మ (చాందినీ చౌదరి)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. అయితే తానూ నల్లగా ఉండడంతో అంత అందమైన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటుందో లేదో అని భయపడి తన ప్రేమని మనసులోనే పెట్టుకుంటాడు.

అయితే జయకృష్ణ వ్యక్తిత్వం బాగా నచ్చిన దీప్తి తన ప్రేమను జయకృష్ణకి చెబుతుంది. ఇక వీరి ప్రేమ విషయం దీప్తి అన్నయ్య ఇన్‌స్పెక్టర్‌ రామరాజు (సునీల్‌)కు తెలియడంతో వారి ప్రేమకు అడ్డుపడుతాడు. ఆ తర్వాత దీప్తికి తెలియకుండా జయకృష్ణ పైన దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఎం జరిగింది. జయకృష్ణ, దీప్తి పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది తెలియాలంటే సినిమాని చూడాలిసిందే..

ఎలా ఉందంటే?

ఇప్పటివరకు తెలుగులో చాలా ప్రేమ కథలు వచ్చాయి. కానీ వివక్షను ఆధారంగా చేసుకొని మాత్ర్రం సినిమాలు మాత్రం రాలేదని చెప్పాలి.. అదే పాయింట్ ని తీసుకొని దర్శకుడు సందీప్‌ రాజ్‌ సినిమాగా తెరకెక్కించడం అభినందించదగ్గ విషయంగా చెప్పుకోవాలి. అయితే కథను నడిపించడంలో మాత్రం చాలా వరకు తడబడ్డాడని చెప్పాలి. సినిమాలోని అసలు పాయింట్ ని విరామంలో స్టార్ట్ చేశాడు దర్శకుడు. ఇక రెండవ భాగంలో హీరోయిన్ తన ప్రేమను హీరోకి చెప్పడం, రెండు సాంగ్స్, ఆ తరవాత హీరోయిన్ అన్నయ్య ఎంట్రీ, వీరి ప్రేమకి అడ్డుచెప్పడం ఇలా అన్ని రొటీన్ గానే అనిపిస్తాయి. ఎమోషన్ సన్నివేశాలను బాగా హండిల్ చేశాడు దర్శకుడు..

ఎవరెవరు ఎలా చేశారంటే?

హీరోగా సుహాస్‌కు ఇది మొదటి సినిమానే అయినప్పటికీ చాలా బాగా నటించాడు. చాలా సహజంగా ఉంటుంది. ఇక దీప్తి పాత్రలో చాందినీ చౌదరి ఒదిగిపోయింది. అటు సునీల్‌ ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నాడు. అయితే విలన్ గా ప్రేక్షకుల్లో భయాన్ని సృస్టించలేకపోయాడు.. ఇక సాంకేతిక నిపుణులు విషయానికి వచ్చేసరికి కాలభైరవ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories