Tillu Square Review: టిల్లు స్క్వేర్‌ రివ్యూ.. సిద్ధు మరో హిట్ కొట్టాడా?

Tillu Square Movie Review in Telugu
x

Tillu Square Review: టిల్లు స్క్వేర్‌ రివ్యూ.. సిద్ధు మరో హిట్ కొట్టాడా?

Highlights

‘డీజే టిల్లు’తో సిద్దు జొన్నలగడ్డ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు టిల్లు పాత్రకు యువతలో ‘కల్ట్’ ఫాలోయింగ్ వచ్చింది.

Tillu Square Review;

చిత్రం: టిల్లు స్క్వేర్‌;

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీ శర్మ, మురళీధర్‌ గౌడ్, నేహా శెట్టి, ప్రిన్స్, నర్రా నాగేశ్వరరావు తదితరులు;

సంగీతం: రామ్‌ మిరియాల, శ్రీచరణ్‌ పాకాల, అచ్చు రాజమణి, భీమ్స్‌;

ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్‌ ఉమ్మడిసింగు;

రచన, స్క్రీన్‌ప్లే: రవి ఆంథోని, సిద్ధు జొన్నలగడ్డ;

దర్శకత్వం: మల్లిక్‌ రామ్‌;

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, ఎస్‌.సాయి సౌజన్య;

విడుదల తేదీ: 29-03-2024

‘డీజే టిల్లు’తో సిద్దు జొన్నలగడ్డ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు టిల్లు పాత్రకు యువతలో ‘కల్ట్’ ఫాలోయింగ్ వచ్చింది. దీని తరువాత ప్రకటించిన ‘టిల్లు స్కేర్’ సీక్వెల్ సుదీర్ఘకాలం షూటింగ్ జరుపుకొని ఎట్టకేలకు నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి, టిల్లు మ్యాజిక్ రిపీట్ అయ్యిందా? టిల్లు పంచిన వినోదం ప్రేక్షకులను అలరించిందా?

కథ

టిల్లు (సిద్దు) లైఫ్ లోకి లిల్లీ (అనుపమ) వస్తుంది. ఒక పబ్‌లో అలా పరిచయమై.. మాయం అవుతుంది. మళ్లీ ఒక నెల తరువాత కనిపించి గర్భవతి అని చెప్తుంది. అప్పటికే లిల్లీ కోసం టిల్లు సైతం వెతుకుతుంటాడు. అలా సడెన్‌గా కనిపించి ప్రెగ్నంట్ అని చెప్పడంతో షాక్ అవుతాడు. చివరికి పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. టిల్లు బర్డ్ డేకి మళ్లీ గతంలో జరిగినట్టే షాకులు తగులుతాయి. ఆ షాకులు ఏంటి? అసలు లిల్లీ ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? మధ్యలో ఈ షేక్ మహబూబ్ (మురళీ శర్మ) ఎవరు? అనేది కథ.

ఎలా సాగిందంటే: ‘డీజే టిల్లు’లో కథ కంటే ఎక్కువగా ప్రేక్షకుల్ని కట్టిపడేసింది టిల్లు పాత్రను తీర్చిదిద్దుకున్న తీరే. ఆ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ చెప్పే సంభాషణలు.. అతని వ్యవహార శైలి.. పలికించే హావభావాలు అందర్నీ కడుపుబ్బా నవ్వించాయి. ‘కథ.. కాకరకాయ’ అంటూ లాజిక్‌లు వెతుక్కోవల్సిన అవసరం లేకుండా రెండున్నర గంటల పాటు థియేటర్లలో హాయిగా పడి పడి నవ్వుకునేలా చేశాయి. ఇప్పుడదే మ్యాజిక్‌ను ‘టిల్లు స్క్వేర్‌’తో మరోసారి పునరావృతం చేయడం కోసం సిద్ధు తన కలం బలంతో.. నటనా ప్రతిభతో శక్తివంచన లేకుండా కృషి చేశాడు. ఆ ప్రయత్నంలో విజయం సాధించాడు. ఈ సీక్వెల్‌ కథ కూడా తొలి భాగం తరహాలోనే సింపుల్‌ లైన్‌లో సాగిపోతుంది. కాకపోతే మరోసారి టిల్లు పాత్రే ఆ సాధారణమైన కథను అసాధారణమైన నటనతో అద్భుతంగా నిలబెట్టేసింది.

నటీనటులు

సిద్దు జొన్నలగడ్డ మరోసారి తన టైమింగ్ తో చెడుగుడు ఆడేశాడు. ఏ అంచనాలతో తనను చూస్తారో వాటిని సంపూర్నంగా నెరవేర్చాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు దాకా విశ్వరూపం చూడొచ్చు. అనుపమ పరమేశ్వరన్ నూరు శాతం పర్ఫెక్ట్ ఛాయస్. గ్లామర్ డోస్ తో పాటు తన పాత్రకిచ్చిన ట్విస్టులను, బోల్డ్ నెస్ ని చక్కగా ప్రదర్శించింది. నేహా శెట్టికి కనిపించిన కాసేపు గుర్తుండిపోయే బ్లాక్ పడింది. మురళీశర్మ ఎక్కువ సేపు లేకపోయినా ఉనికిని చాటుకున్నాడు. ప్రిన్స్ కొంచెం లౌడ్ గా అనిపించినా ఓకే. బ్రహ్మాజీ ఒక్క సీన్ కే పరిమితం చేశాడు. మురళీధర్ గౌడ్ మరోసారి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇతర ఆర్టిస్టులకు దక్కిన స్కోప్ తక్కువే అయినా లాక్కొచ్చేశారు

సాంకేతిక వర్గం

రామ్ మిర్యాల, అచ్చు రాజమణి పాటలు బాగున్నాయి. డీజే టైటిల్ ట్రాక్ మళ్ళీ వాడుకున్నారు కానీ కొత్తగా ట్రై చేయాల్సింది. విజువల్ గా కూడా సాంగ్స్ ఆకట్టుకున్నాయి. భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. అక్కడక్కడా కొంచెం అటుఇటు ఊగినా మూడ్ ని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చాడు. సాయి ప్రకాష్ ఛాయాగ్రహణంలో లోపాలేం లేవు. ఫ్రేమింగ్, కలర్ టోన్ అన్నీ మంచి క్వాలిటీలో వచ్చాయి. నవీన్ నూలి ఎడిటింగ్ నిడివిని కేవలం రెండు గంటలకు కుదించడం పెద్ద ప్లస్ పాయింట్. దీని వల్ల ల్యాగ్ కు ఛాన్స్ దొరకలేదు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బడ్జెట్ పరంగా ఎంత అవసరమో అంతా ఖర్చు పెట్టారు. రాజీ ప్రస్తావన రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories