రివ్యూ : తిప్పరా మీసం

రివ్యూ : తిప్పరా మీసం
x
Highlights

విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు.. అతని నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులలో అందులో ఎదో ఒక పాయింట్...

విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు.. అతని నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులలో అందులో ఎదో ఒక పాయింట్ ఉంటుంది అన్న ఆసక్తిని కలగజేస్తుంది. అందులో భాగంగానే తిప్పరామీసం అంటూ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీవిష్ణు . మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో మన సమీక్షలో చూద్దాం..

కథ:

చిన్నప్పుటి నుండి మత్తుకు బానిస అవుతాడు మణిశంకర్ (శ్రీవిష్ణు) దీనితో కుటుంబాన్ని పక్కన పెడతాడు. అతనిని మత్తు నుండి దూరం చేయాలనే ఆలోచనలో భాగంగా అతడి తల్లి లలితాదేవి (రోహిణి) అతన్ని రిహాబిటేషన్‌ సెంటర్‌లో చేరుస్తోంది. కానీ అక్కడినుండి పారిపోయి ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ ఉంటాడు మణిశంకర్ .. ఇక ఇందులో భాగంగా ఓ క్రికెట్ బూకీ వద్ద ముప్పై లక్షల అప్పు పడతాడు. దీనిని తీర్చేందుకు తన తల్లిని వేధిస్తూ ఉంటాడు .ఆస్తిలో వాట ఇవ్వమని కోరుతాడు. అందుకు గాను అయిదు లక్షల రూపాయల చెక్ ని ఇస్తుంది లలితాదేవి. కానీ ఆ 5 లక్షల చెక్కు ఫోర్జరీ చేసి అది బౌన్స్‌ కావడంతో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఆ తర్వాత ఓ మర్డర్ కేసులో ఇరుకుంటాడు మణి.. ఇంతకి ఆ మర్డర్ చేసింది ఎవరు ? తల్లిపై వేసిన బౌన్స్ కేసులో ఎవరు గెలుస్తారు అన్నది తెరపైన చూడాలి.

ఎలా ఉందంటే ?

కొత్త కొత్త కథలు ఉండవు.. ఉన్న కథలనే ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో మెప్పించే రోజులు ఇవి. యువ దర్శకుల ఆలోచనలు కూడా ఇలాగే ఉంటున్నాయి. తల్లి కొడుకుల బంధం చుట్టూ కథ ఎంచుకున్నాడు దర్శకుడు.. కానీ కథనాన్ని మాత్రం అంతా ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోయాడు. ఎక్కువగా మణి అనే పాత్రని నెగిటివ్ షేడ్స్ పైన తీసుకువెళ్ళినప్పటికి ప్రేక్షకుడికి మాత్రం అతడిపైన జాలిలాగే అనిపిస్తుంది. డ్రగ్స్,మద్యం,సిగరెట్స్ కి అలవాటు పడిన సన్నివేశాలు కొత్తగా అనిపించవు. దీనికి తోడు మణి పాత్రను సాగాదీసినట్టుగా అనిపిస్తుంది. మొదటి భాగంలో తల్లిని కోర్టుకి ఈడ్చడం లాంటి సన్నివేశాలు ఎం జరగబోతుంది అన్న ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇక రెండవ భాగం ఎక్కువగా అనుకున్న సన్నివేశాలు ఉండడంతో కథలో లీనం అయ్యేందుకు ప్రేక్షకుడికి స్కోప్ దొరకదు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్వీస్ట్‌ ఆసక్తికరంగా ఉన్నాయి. అంతేకాకుండా మదర్‌ సెంటిమెంట్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథనం ప్లాట్ గా సాగడంతో ప్రేక్షకులకి అంతగా ఆకట్టుకోదు అనే చెప్పాలి.

నటినటులు :

ఎప్పటిలాగే శ్రీవిష్ణు తనదైన శైలిలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో శ్రీవిష్ణు నటన బాగుంది. ఇక మథర్ గా రోహిణి ఆకట్టుకుంది. హీరోయిన్‌ నిక్కీ తంబోలీ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు అని చెప్పాలి. మిగతా నటినటులు తమ పాత్రల మేరకు రాణించారు.

సాంకేతిక వర్గం :

సినిమాకి ప్రధాన బలం నేపధ్య సంగీతం అని చెప్పాలి. పాటలు ఆకట్టుకునే స్థాయిలో లేవు.. నిర్మాణ విలువులు సినిమా స్థాయికి తగట్టుగా లేవు, సినిమాటోగ్రఫీ బాగుంది.

చివరగా ఓ మాట : ప్రేక్షకుడు మీసం తిప్పేలా లేదు

గమనిక : సినిమా రివ్యూ ఒక ప్రేక్షకుడికి మాత్రమే సంబంధించినది. పూర్తి సినిమాని ధియేటర్ కి వెళ్లి చూడగలరు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories