The Kerala Story Movie Review: ది కేరళ స్టోరీ రివ్యూ.. దుమారం రేపుతున్న ఈ సినిమాలో ఏముందంటే..?

The Kerala Story Movie Review
x

The Kerala Story Movie Review: ది కేరళ స్టోరీ రివ్యూ.. దుమారం రేపుతున్న ఈ సినిమాలో ఏముందంటే..?

Highlights

The Kerala Story Movie Review: ది కేరళ స్టోరీ రివ్యూ.. దుమారం రేపుతున్న ఈ సినిమాలో ఏముందంటే..?

The Kerala Story Movie Review: నిఘా వర్గాల హెచ్చరికలు, దేశ వ్యాప్త ఆందోళనలు, భారీ నిరసనల మధ్య ది కేరళ స్టోరీ చిత్రం బాక్సాఫీస్ ముందుకొచ్చింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సినిమాని నిలిపివేయాలని నిరసనలు ఓవైపు జరుగుతున్నా బందోబస్తు నడుమ సినిమాని ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా ప్రదర్శనపై కొచ్చిలోని పీవీఆర్ సినిమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ థియేటర్స్ లో సినిమా ప్రదర్శనను నిలిపివేసింది. ఇదిలా ఉంటే, కేరళలోని కొన్ని యదార్థ సంఘటనలు ఆధారంగా చేసుకొని సుదీప్తోసేన్ దర్శకత్వంలో విపుల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అదాశర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ముఖ్యపాత్రలు పోషించారు.

కథ ఏంటి:

అదా శర్మ కేరళలోని కాసర్ గోడ్ లోని నర్సింగ్ కళాశాలలో చేరుతుంది. అక్కడ ఇస్లాం మతంలోకి మారడానికి బ్రెయిన్ వాష్ చేయబడిన మరో ఇద్దరు అమ్మాయిలను కలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ది కేరళ స్టోరీ సినిమా. కేరళలోని లవ్ జీహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, రాడికలైజేషన్, ఐసిస్ రిక్రూట్ మెంట్ వంటి సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. యూఎన్ డిటెన్షన్ సెంటర్ లో గాయపడిన అదాశర్మ సన్నివేశంతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. విచారణ సమయంలో ఆమె శిక్షణ పొంది ఐసిస్ ఉగ్రవాదిగా ఎలా మారింది అనే విషయాలను గుర్తు చేసుకుంటుంది.

సినిమాని ఫ్లాష్ బ్యాక్, ప్రస్తుత సన్నివేశాల మధ్య బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు సుదీప్తోసేన్ చక్కగా మలిచారు. సంజయ్ శర్మ ఎడిటింగ్ బాగుంది. సినిమాలో హిందూ మతపరమైన ఆరాధన, నాస్తికత్వం, కమ్యునిజం, ఇస్లాం, షరియా చట్టాలను బోధించే ప్రక్రియలను దర్శకుడు చాలా బ్యాలెన్డ్స్ గా చూపించారు. ఇక అదాశర్మ, యోగితా, సోనియా, సిద్ధి సైతం చక్కటి పర్ ఫార్మెన్స్ కనబరిచారు. మొత్తంగా వాస్తవాలు వివాదాలు ఎలా ఉన్నా ది కేరళ స్టోరీ చూసేందుకు బాగుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories