Syeraa Twitter Review: సైరా సూపర్ హిట్ అంటున్నారు!

Syeraa Twitter Review: సైరా సూపర్ హిట్ అంటున్నారు!
x
Highlights

సైరా సినిమా ఇప్పుడు సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాలకు దసరా కళను మరింత పెంచింది. సినిమా twitter అభిప్రాయాల ప్రకారం సూపర్ హిట్ టాక్ వినిపిస్తోంది.

మెగా మూవీ సైరా థియేటర్లలో సందడి చేస్తోంది. మంగళవారం రాత్రి నుంచే ఆంధ్రప్రదేశ్ కు దసరా పండగ వచ్చేసింది. అన్ని చోట్ల మెగాస్టార్ చిరంజీవి ముచ్చట్లే. ఎప్పుడెప్పుడు సైరా చూస్తామా అనే అభిమానులతొ పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎదురు చూశారు. ఏపీలో తెల్లవారుజామునే షో ప్రారంభం అయిపొయింది. తెలంగాణలో మాత్రం 8 గంటలకు మొదలవుతాయి. ఇక అమెరికా లాంటి చోట్ల ప్రీమియర్ షో లు పూర్తయ్యాయి.

సైరా భారీ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా ఎలా ఉందొ అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. సైరా సినిమా ఇప్పటికే చూసిన కొందరు సినిమా పై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం సైరా చిరంజీవి సినిమా లా ఉందంటున్నారు. దేశభక్తి కి చిరంజీవి నటన తోడై సినిమా ఓ రేంజ్ లో ఉందంటున్నారు. బాలీవుడ్ లో జర్నలిస్ట్ ల కోసం ప్రత్యేకంగా నిన్న రాత్రి ఓ షో వేశారు. అది చూసిన వారంతా సైరా సినిమా అదిరిపోయింది అంటున్నారు. తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కినట్టుగా ఉందని చెబుతున్నారు.

ఇక ట్విట్టర్ లో అమెరికా నుంచి వచ్చిన రిపోర్టుల ప్రకారం చిరంజీవి పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. అద్భుతమైన తారాగణం, రోమాలు నిక్కబొడిచే డైలాగులు, మనల్ని ఆ లోకంలోకి తీసుకెళ్లే బ్యాక్ ‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యుద్ధ సన్నివేశాలు ఇలా సినిమాలో అన్నీ బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి నటన అద్భుతమట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన జీవించేశారని కొనియాడుతున్నారు. నయనతార, తమన్నా సైతం సినిమాకు ప్లస్ అయ్యారట. మెగా అభిమానుల ఆనందానికి అయితే అవధుల్లేవు. మెగా అభిమానిని అయినందుకు గర్వంగా ఉందంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఇక దర్శకుడు సురేందర్ రెడ్డిపై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. సెకండాఫ్ సినిమాని అద్భుతంగా డీల్ చేశారనీ, దేశభక్తి సినిమాని కమర్షియల్ రేంజ్ లో తీసి చిరంజీవి నట జీవితంలో మరో మరుపురాని సినిమాని ఇచ్చారని చెబుతున్నారు. సినిమా నిర్మించిన చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తండ్రికి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారని ట్విట్టర్ వేదికగా పలువురు సినిమా పై తమ అభిప్రాయం చెబుతున్నారు. ఇప్పటివరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ట్విట్టర్ లో వచ్చిన అభిప్రాయాల ప్రకారం సైరా సూపర్ హిట్. కొద్ది సేపు ఆగితే మనమూ సినిమా చూసి ఎలా ఉందొ మాట్లాడేసుకోవచ్చు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories