Dhamaka Movie Review: 'ధమాకా' మూవీ రివ్యూ.. రవితేజ కాతాలో మరో హిట్..

Dhamaka Movie Review: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కంబినేషన్ లో వచ్చిన పక్క మాస్ ఎంటర్ ట్రైనర్ మూవీ ధమాకా.

Arun Chilukuri
Published on: 23 Dec 2022 1:31 PM IST
Ravi Teja Dhamaka Movie Review
X

Dhamaka Movie Review: ‘ధమాకా’ మూవీ రివ్యూ.. రవితేజ కాతాలో మరో ధమాకా హిట్..

Dhamaka Movie Review: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కంబినేషన్ లో వచ్చిన పక్క మాస్ ఎంటర్ ట్రైనర్ మూవీ ధమాకా. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సందడి చేస్తుంది. క్రాక్ హిట్ తర్వాత వరుస ప్లాప్ లతో డీలా పడ్డ రవితేజ, ఈ మూవీ తో మరో హిట్ ని తన కాతాలో వేసుకున్నాడంటున్నారు. రవితేజ మాస్ అండ్ కామెడీ రూట్లో చేసిన చాలా ప్రయోగాలు హిట్టు మెట్టెక్కాయి. అలానే ఈ మూవీ కూడా ఒక్కప్పటి మాస్ కామెడీ ని గుర్తు చేసాడంటున్నారు., వెంకీ , ఆంజనేయులు లాంటి సినిమాల తర్వాత ధమాకా అంటూ మరోసారి కామెడీ కమ్ యాక్షన్ తో రవితేజ మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యాడనే చెప్పొచ్చు.

ఇక కథ విషయానికి వస్తే స్వామి అనే మధ్యతరగతి వ్యక్తి .. ఉద్యోగం పోవడంతో, మరల వన్ మంత్ లో ఉద్యోగం లో చేరితేనే, తన చెల్లెలి పెళ్లి చేసే పరిస్థి రావడం, అలానే చెల్లెలి ఫ్రెండ్ పావనిని చూడగానే స్వామి ఇష్టపడటం.. ఇక మరోవైపు పీపుల్స్ మార్ట్ కంపెనీ వారసుడు ఆనంద్ చక్రవర్తి అనే మల్టీ మిలినీయర్ కి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనే తండ్రి ఆశ .. ఈ ఇద్దరినీ చూసి హీరోయిన్ కన్‌ఫ్యూజ్ పడటం, ఎవరిని ఎంచుకోవాలో తెలియక ఇద్దరితో కొన్నాళ్లు ట్రావెల్ చేయాలనుకోవడం.. మరోవైపు పీపుల్స్ మార్ట్ కంపెనీ చేజిక్కించుకోవాలని విలన్ ప్రయత్నిచడం.. ఆ తరువాత పావని ఎవరిని ఇష్టపడింది? విలన్ ప్రయత్నాలను ఆనంద్ చక్రవర్తి అడ్డుకున్నాడా లేడా అనేదే ధమాకా సినిమా కథ.

మాస్ మహారాజ్ రవితేజ స్వామి గా , ఆనంద్ చక్రవర్తి గా డ్యూయల్ రోల్ లో మెప్పించాడు. ఇక పావని గా శ్రీలీల, తన తండ్రి పాత్రలో రావు రమేష్ ఆకట్టుకున్నారు. ఇక రావు రమేష్, హైపర్ ఆదిల మధ్య వచ్చిన కామెడీ ట్రాక్ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక త్రినాథ్ రావు మేకింగ్, ప్రసన్న రైటింగ్స్ ఈ సినిమాకు బాగా కలిసొస్తే .. భీమ్స్ మ్యూజిక్ మ్యాజిక్ చేసిందంటున్నారు. మొత్తంగా రవితేజ కామెడీ రూట్లో మాస్ యాక్షన్ చూపించి..క్రాక్ హిట్ తరువాత రవితేజ కాతాలో మరో ధమాకా హిట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story