Ravi Teja: 'రావణాసుర' రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Ravanasura Movie Review in Telugu
x

Ravi Teja: ‘రావణాసుర’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Highlights

Ravi Teja: ‘రావణాసుర’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: రావణాసుర

నటీనటులు: రవి తేజ, సుశాంత్, అను ఏమాన్యూల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, జయ రామ్, హైపర్ ఆది, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ, మురళీ శర్మ, సంపత్ తదితరులు

సంగీతం: హర్ష వర్ధన్, భీమ్స్

సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్

నిర్మాతలు: అభిషేక్ నామా, రవి తేజ

దర్శకత్వం: సుధీర్ వర్మ

బ్యానర్: అభిషేక్ పిక్చర్స్

విడుదల తేది: 07/04/2023

కిలాడి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించారు ఈ రెండు సినిమాలతోనూ 100 కోట్ల కలెక్షన్లను అందుకున్న ఈ రెండు చిత్రాలతో బాగానే ఆకట్టుకున్న రవితేజ తాజాగా ఇప్పుడు రావణాసుర అనే సైకలాజికల్ యాక్షన్ త్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. స్వామి రారా సేమ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదలైంది. టీజర్ మరియు ట్రైలర్లతో బాగానే ఆకట్టుకున్న ఈ చిత్రం రవితేజ కి ఖచ్చితంగా హాటర్ కి హెటిస్తోందని అభిమానులు విశ్వసిస్తున్నారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎంతవరకు హిట్ అందుకున్నారో చూసేద్దామా..

కథ:

రవి (రవి తేజ) ఒక క్రిమినల్ లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు. రవి బాస్ అయిన కనక మహా లక్ష్మి (ఫరియా అబ్దుల్లా) ఒకప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్. ప్రస్తుతం రవి హారిక (మేఘ ఆకాష్) కేసుని టేకప్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అసలు హారిక ఎలాంటి కేసులో ఇరుక్కుంది? రవి ఈ కేస్ ని ఎందుకు సాల్వ్ చేయాలని అంత ఆసక్తి చూపిస్తున్నాడు? వరుసగా జరుగుతున్న హత్యలకి రవికి ఏంటి సంబంధం? చివరికి ఏమైంది? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

టీజర్ మరియు ట్రైలర్ లలో చూపించినట్లు రవితేజ ఈ సినిమాలో ఒక డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ఇక రెండు షేడ్స్ నీ రవి తేజ చాలా బాగా చూపించారు. సినిమాలో చాలావరకు రవితేజ తన ట్రేడ్ మార్క్ ఎనర్జీ మరియు కామెడీ టైమింగ్ తో బాగానే అలరించారు. కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న కూడా రవి తేజ నటన తో అందరి దృష్టిని ఆకర్షించారు. తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. లుక్స్ పరంగా కూడా రవితేజ చాలా క్లాస్ గా కనిపించారు. సరికొత్త స్టైలింగ్ తో బాగానే ఆకట్టుకున్నారు. చెప్పుకోవడానికి ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు కానీ కొంతమందికి మాత్రమే మంచి స్కోప్ ఉన్న పాత్రలు లభించాయి. తమ పాత్రల పరిధి మేరకు మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ మరియు అను ఏమాన్యూల్ బాగానే నటించారు. సుశాంత్ కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది. ఇక తన నటనతో సుశాంత్ భాగానే ఆకట్టుకున్నాడు. హైపర్ ఆది కామెడీ కూడా అక్కడక్కడ బాగానే వర్క్ అయ్యింది. సంపత్ రాజ్, మురళీ శర్మ, జయ రామ్ వంటి సీనియర్ నటులు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

గతంలో "స్వామి రారా", "కేశవ", "రణరంగం" వంటి ఆసక్తికరమైన సినిమాలకు దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం కూడా సుధీర్ వర్మ ఒక ఆసక్తికరమైన కథను ఎంచుకున్నారు. కమర్షియల్ ఎలిమెంట్లు కూడా ఉన్న థ్రిల్లర్ ను ప్రేక్షకులు తీసుకురావాలని ప్రయత్నించారు. కథ బాగానే ఉన్నప్పటికీ సినిమా చాలావరకు ఒక రెగ్యులర్ టెంప్లేట్ లోనే నడుస్తుంది. స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా ఉండటం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ అందించిన సంగీతం సినిమాకి బాగానే హెల్ప్ అయింది. పాటలు యావరేజ్ గా ఉన్నప్పటికీ నేపథ్య సంగీతం బాగానే అనిపిస్తుంది. విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ కూడా చూడచక్కగా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

రవి తేజ

ప్రీ ఇంటర్వల్

సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు

బలహీనతలు:

ప్రెడిక్టబుల్ కథ

స్లో సన్నివేశాలు

థ్రిల్ ఎలిమెంట్లు లేకపోవడం

చివరి మాట:

సినిమాలోని ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా యావరేజ్ గా నడుస్తుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే ఆకట్టుకుంటాయి. అయితే ఇంటర్వెల్ కి ముందు వచ్చే సినిమా మాత్రం బాగానే ఆకట్టుకుంది. ప్రేక్షకులలో ఆసక్తిని కూడా కలిగిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ బాగానే మొదలైనప్పటికీ కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా అనిపిస్తాయి. వరుస హత్యల వెనక కారణం చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అవి మిగతా సినిమాలలో చూసినట్లు అనిపిస్తాయి తప్ప కొత్తగా కనిపించవు. లాజిక్ లేని సీన్స్ ప్రేక్షకులకు చాలా చిరాకు తెప్పిస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్లు బాగానే ఉన్నప్పటికీ కట్టిపడేసే త్రిల్లింగ్ ఎలిమెంట్లు లేకపోవడం సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో మేకప్ కూడా ఏమాత్రం సెట్ అవ్వదు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నప్పటికీ సినిమా జోనర్ కి తగ్గ న్యాయం చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు.

బాటమ్ లైన్:

లాజిక్స్ లేకుండా మ్యాజిక్ చేయాలని ప్రయత్నించి ఆకట్టుకోలేక పోయిన "రావణాసుర".

Show Full Article
Print Article
Next Story
More Stories