ట్విట్టర్ రివ్యూ :రాక్షసుడు ఎంగేజింగ్ థ్రిల్లర్...

ట్విట్టర్ రివ్యూ :రాక్షసుడు ఎంగేజింగ్ థ్రిల్లర్...
x
Highlights

సరైన హిట్టు కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెగ ఆరాటపడుతున్నాడు. బడబడా నిర్మాలతో మంచి హిట్టు ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేస్తున్నా, ఓ మంచి హిట్టు ఐతే...

సరైన హిట్టు కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెగ ఆరాటపడుతున్నాడు. బడబడా నిర్మాలతో మంచి హిట్టు ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేస్తున్నా, ఓ మంచి హిట్టు ఐతే పడడం లేదు.. తాజాగా తేజ దర్శకత్వంలో వచ్చిన సీత సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.. అయితే, ఈ సారి రాక్షసుడు అనే ఓ రీమేక్ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందు వచ్చాడు.

తమిళ్ లో వచ్చిన రాచ్చసన్ అనే సినిమాని తెలుగులో రాక్షసుడు అనే పేరుతో తెలుగులో తెరకెక్కించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్ గా నటించారు. రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్ తమ్ముడు సాగర్ మాటలు అందించారు. ఎ స్టూడియోస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై కోనేరు స‌త్యనారాయ‌ణ ఈ సినిమాని నిర్మించారు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేసింది..

విడుదల చేసిన ట్రైలర్ తో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే సినిమా యూఎస్ లో విడుదల కావడంతో ఫాన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. గత సినిమాలతో పోలిస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో బాగా ఆకట్టుకున్నాడని అంటున్నారు. సినిమాకి మొదటి భాగం బాగుందని ఇక రెండవ భాగం మాత్రం ఒరిజినల్ లో ఉన్న స్క్రీన్ ప్లే మిస్ కాకుండా అలాగే తీశారని అంటున్నారు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకి హైలెట్ అని చెపుతున్నారు.

కొన్ని సన్నివేశాలు బాగా ఇంట్రెస్టింగ్ గా సాగాయని చెబుతున్నారు. ఈ సినిమాని ఆల్రెడీ తమిళ్ లో చూసిన వారికి పెద్దగా ఇంప్రెస్ అవ్వరని చెబుతున్నారు. ఇక జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని చెబుతున్నారు. ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్టు కొట్టడం ఖాయమని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories