Salaar Review: ప్రభాస్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Prabhas Salaar Movie Review
x

Salaar Review: ప్రభాస్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Highlights

రెబెల్ స్టార్ ప్రభాస్ తో కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా సాలార్.

Salaar Review; చిత్రం: సలార్‌: పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌;

నటీనటులు: ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, జగపతిబాబు, బాబీ సింహా, టినూ ఆనంద్‌, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి తదితరులు;

సంగీతం: రవి బస్రూర్‌;

సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ;

ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కుల్‌కర్ణి;

నిర్మాత: విజయ్‌ కిరంగదూర్‌;

రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌;

విడుదల: 22-12-2023

పవర్ ఫుల్ హీరో చుట్టు పవర్ ఫుల్ స్టోరీ రాసుకోవడం ప్రశాంత్ నీల్ స్పెషాలిటీ. అందుకే కేజీఎఫ్ సినిమాలో పవర్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్ అనే డైలాగ్ ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఆ డైలాగ్ వస్తున్నప్పుడు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అలాంటి ప్రయత్నమే మళ్లీ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్‌ సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ హీరో చుట్టు పవర్ ఫుల్ కథ అల్లే ప్రయత్నం చేశాడు. కాన్‌సార వంటి ఓ పవర్ ఫుల్ ప్లేస్‌ను చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఆ ప్లేస్‌కు, హీరో ప్రభాస్‌కు ఉన్న సంబంధాన్ని ఓ కథ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

కేజీఎఫ్‌లో నరాచీ, సలార్‌లో కాన్సార. ప్రపంచంతో సంబంధం లేని ఓ ప్రాంతం, అందులోని మనుషులు, వారి కష్టాలు, ఆ ప్రజలను పీడించే పాలకులు, ఆ పాలకులకు ఓ ప్రభువు.. ఆ ప్రభువు సింహాసనం కోసం పాలకులు పన్నే కుట్రల కథాంశమే సలార్ సినిమా. అయితే కేజీఎఫ్‌ రెండు సిరీస్‌లలో ఉన్నంత స్పష్టంగా సలార్ కథ ఉండదనే చెప్పాలి. కేజీఎఫ్‌లో హీరో కనిపించిన ప్రతీ సన్నివేశంలో ఎలివేషన్లు ఆకాశాన్నంటేలా ఉంటాయి. అయితే సలార్‌లో మాత్రం ప్రభాస్ ప్రారంభంలో కాస్త మెత్తగ్గా కనిపిస్తాడు. ఓ శక్తివంతమైన సన్నివేశం కోసం తొలుత హీరో క్యారెక్టర్‌ను డైరెక్టర్ ఇలా బిల్డ్ చేశాడని అర్థమవుతోంది. సినిమా సాగుతున్నా కొద్ది ప్రభాస్ హీరోయిజాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బయటకు తీసే ప్రయత్నం చేశాడు.

ప్రభాస్ గత సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో ఆయన ఫ్యాన్స్‌కు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. అయితే కేజీఎఫ్‌తో పోల్చి చూస్తే... సలార్ ఆ స్థాయి సినిమా కాదనే చెప్పాలి. కేజీఎఫ్‌లో ‍యష్ క్యారెక్ట్‌ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. హీరో క్యాస్టూమ్స్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్‌ వరకు అన్నింటిలో హీరోయిజం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కానీ సలార్‌లో మాత్రం కేజీఎఫ్‌ స్థాయి హీరోయిజం లేదు. ఈ సన్నివేశంలో హీరో ఫైట్‌ చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు అనుకుంటారు. కాని అక్కడ ఫైట్ రాకుండా హీరోను సైలెంట్‌గానే ఉంచే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, దాంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వం నుంచి ప్రేక్షకులు కోరుకున్న ఆ ఎలివేషన్లు కొన్ని చోట్ల మిస్ అయ్యాయనే చెప్పాలి.

సలార్ కథ అస్పష‌్టంగా ఉందని చెప్పక తప్పదు. ముఖ్యంగా హీరోయిన్ స్క్రీన్ మీదకు రాగానే ప్రేక్షకులు ఆమె పాత్రను ఓన్ చేసుకునేందుకు చాలా టైమ్ పడుతుంది. అర్థం కాకుండా గజిబిజిగా సాగుతున్న కథకు హీరోయిన్ పాత్ర మరింత అవరోధంగా మారుతోంది. శృతిహాసన్ కూడా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ చేయలేదు. ఇంటర్‌వెల్ సీన్ వస్తేగాని కథపై ఓ స్పష్టమైన అంచనాకు ప్రేక్షకుడు రాలేని పరిస్థితి. పూర్తి కథను అర్థం చేసుకునే సమయానికి కథకు ఓ ఉపకథను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ ఉపకథకు మరో ఉపకథ, అందులోని పేర్లను ఆడియన్స్‌ గుర్తు పెట్టుకుందామన్నా గుర్తు పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇలా సలార్‌ స్టోరీ ఏంటి అనుకునే లోపే సినిమా అయిపోతుంది.

మ్యూజిక్ డైరెక్ట్ రవి కేజీఎఫ్ స్థాయిలో ఈ సినిమాకు సంగీతాన్ని అందించలేదనే చెప్పాలి. సినిమా ప్రారంభంలో ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్ రాను రాను ప్రేక్షకుడు ఊహలను అందుకోలేకపోయింది. కేజీఎఫ్ ట్రైలర్ ఎలా ఉంటుందో సినిమాలోని ప్రతీ సీన్‌ అంతే షార్ప్‌గా ఉంటుంది. ఓ వంద ట్రైలర్లు ఒకే సారి చూస్తే ఎంత కిక్ వస్తుందో కేజీఎఫ్ చూసినా అలానే అనిపిస్తోంది. అయితే సలార్‌కు వచ్చే సరికి ఆ ఎడిటింగ్ ఫార్ములా మిస్ అయింది. అయితే స్క్రీన్‌ ప్లే లోపమే ఎడిటింగ్‌పై పడిందనే చెప్పాలి. స్క్రీన్‌ప్లే పూర్తి స్పష్టంగా వస్తే.. కాస్త అటూ ఇటూగానైనా కేజీఎఫ్ మూడో పార్ట్‌లా సినిమా సాగేది. కాని కొత్తగా చెప్పే ప్రయత్నంలో మొదటికే మోసం వచ్చిందని చెప్పవచ్చు.

రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో పోల్చితే.. ఈ సినిమాలో హీరో ప్రభాస్‌ అవుట్ అండ్ అవుట్ మాస్‌లో లుక్‌లో కనిపించాడనడటంలో ఎలాంటి డౌట్‌ లేదు. అయితే ప్రశాంత్ నీల్ గత సినిమాలతో పోల్చినప్పుడు మాత్రమే.. ఈ సినిమా ఆస్థాయిలో లేదని స్పష్టంగా అర్థమవుతోంది. కేజీఎఫ్‌తో కంపేయిర్ చేస్తే.. సలార్‌ ఓ యావరేజ్‌ సినిమాగానే మిగిలిపోతుంది. ఓ సినిమాను మరోసినిమాతో పోల్చి చూడకూదని అనుకున్నా... కథలో రెండు సినిమాలకు మధ్య పోలికలు ఉంటాయి. కాబట్టి కేజీఎఫ్‌తో పోల్చి చూస్తే సలార్ తేలిపోతుంది. వరుస ఫ్లాప్‌‌ల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్‌కు కాస్త ఊరటనిచ్చే సినిమా వచ్చినా.. సలార్‌ను ఓవరాల్‌గా పరిశీలిస్తే.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ స్థాయి సినిమా కాదని మాత్రం చెప్పవచ్చు. సినిమాను భారీగా ప్రమోట్ చేస్తే.. ఆ స్థాయిని అందుకోలేదని సలార్ టీమ్ ముందే గ్రహించినట్లు ఉంది. ప్రమోషన్లు భారీ చేస్తే మాత్రం... సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్‌ను సైతం నిరాశపరిచేది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Show Full Article
Print Article
Next Story
More Stories