'పలాస 1978' మూవీ రివ్యూ..

palasa 1978 Movie poster
x
Palasa movie review
Highlights

కొన్ని సినిమాలు ధియేటర్లోకి వచ్చాక హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ట్రైలర్, టీజర్ లతో ఆకట్టుకొని ముందే హిట్ టాక్ ని సొంతం చేసుకుంటాయి

కొన్ని సినిమాలు ధియేటర్లోకి వచ్చాక హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ట్రైలర్, టీజర్ లతో ఆకట్టుకొని ముందే హిట్ టాక్ ని సొంతం చేసుకుంటాయి. అందులో ఈ మధ్య ఆకట్టుకున్న చిత్రం 'పలాస 1978' .. రక్షిత్, నక్షత్ర మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించగా, ధయాన్ అట్లూరి సినిమాని నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ లతో ఆకట్టుకున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో మన రివ్యూలో చూద్దాం..

కథ :

ఇక కథ విషయానికి వస్తే సినిమా మొత్తం 1970-80ల కాలంలో పలాస అనే ప్రాంతంలో జరుగుతుంది. అక్కడి ప్రాంతంలో షావుకారి లింగమూర్తి (జనార్ధన్ రావు), చిన్న షావుకారి గురుమూర్తి (రఘు కుంచె) అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. ఇక అదే ఊళ్లో మోహన్ రావు (రక్షిత్), రంగారావు (తిరువూర్) అనే ఇద్దరు తక్కువ కులం అన్నదమ్ములు ఉంటారు. ఇలా నిమ్న కులాలకు చెందిన వీరికి, అగ్ర కులాలకి చెందిన షావుకారి అన్నదమ్ములుకి మధ్య గొడవలు వస్తాయి. ఈ నేపధ్యంలో ఆ గొడవలు ఎటు వైపు దారి తీశాయి. ఈ కథలో లక్ష్మీ (నక్షత్ర) పాత్ర ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

ఎలా ఉందంటే ?

అగ్ర కులాలు, నిమ్న కులాలు మధ్య రాజకీయపోరు అంటే మనకి టక్కున రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమానే గుర్తుకువస్తోంది. సినిమా నేపధ్యం కూడా అదే కావడంతో ఎక్కువగా ఈ సినిమాని రంగస్థలంతో పోల్చి చూశారు. కానీ దానికి భిన్నంగా సినిమా ఉంటుంది. రొటీన్ రివెంజ్ ప్లాట్ అయినప్పటికీ ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిభాగం వరకు పర్వాలేదు అనిపించినా రెండోభాగం మాత్రం బాగా నెమ్మదించింది. పాత్రల ఎంపిక సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక కథ కోసం కథ కోసం దర్శకుడు చేసిన రీసెర్చ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. సినిమాలో డైలాగ్స్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కడుపు నిండిపోయిన కథ.. కడుపు మండిపోయిన కథ, వినాయకుడి తలను అతికించిన దేవుడు.. ఏక లవ్యుడిని వేలిని అతికించడానికి రాలేదు, వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్ ఉహించిందే కావడం సినిమాకి మరో మైనస్ గా చెప్పుకోవచ్చు.

నటినటులు :

మోహన్ రావు పాత్రలో రక్షిత్ నటన ఆకట్టుకుంది.లుక్ పరంగా, పెర్ఫార్మన్స్ పరంగా మెప్పించాడు రక్షిత్ .. ఎమోషనల్ సన్నివేశాలలో కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఇక రఘు కుంచెని ఈ సినిమా మరో స్థాయిలో నిలబెడుతుంది. విలనిజాన్ని పండించడంలో రఘు కుంచె సక్సెస్ అయ్యాడు. ఇక పాత్ర పరిధి మేరకు హీరోయిన్ గా నక్షత్ర బాగానే చేసింది.

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఆ కాలం నాటి పరిస్థితులను కళ్ళకి కట్టినట్టు చూపించడంలో సినిమాటోగ్రఫర్ అరుల్ విన్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఇక రఘు కుంచె అందించిన సంగీతం బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్తా ద్రుష్టి పెడితే బాగుండు అనిపిస్తోంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.

ఇక ఓవరాల్ గా పలాస సినిమాలో కొత్తదనం లేకపోయినప్పటికీ పాత్రలు, సంభాషణలు ఆకట్టుకుంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories