Operation Padma Review: ఆపరేషన్ పద్మ మూవీ రివ్యూ: మైండ్ గేమ్స్‌తో కూడిన రాజకీయ థ్రిల్లర్..!

Operation Padma Review: ఆపరేషన్ పద్మ మూవీ రివ్యూ: మైండ్ గేమ్స్‌తో కూడిన రాజకీయ థ్రిల్లర్..!
x
Highlights

Operation Padma Movie Review: ఘట్టమనేని అరవింద్ బాబు, రాఘవ మండలపు, రాంబాబు మండలపు నిర్మించిన ‘ఆపరేషన్ పద్మ’ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. హై-స్టేక్స్...

Operation Padma Movie Review: ఘట్టమనేని అరవింద్ బాబు, రాఘవ మండలపు, రాంబాబు మండలపు నిర్మించిన ‘ఆపరేషన్ పద్మ’ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. హై-స్టేక్స్ రాజకీయాలు, ప్రైవేట్ గూఢచర్యం, సస్పెన్స్ నిండిన మైండ్ గేమ్స్‌ను వాస్తవికతతో మేళవిస్తూ కార్తికేయ వి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో ఇప్పుడు చూద్దాం.

కథ

మాజీ హోం మంత్రి నంది కిషోర్ పౌర సరఫరా శాఖలో జరిగిన భారీ అవినీతి కుంభకోణాన్ని బయటపెడతాడు. ఈ ఒక్క నిర్ణయం అతన్ని రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారుస్తుంది. ప్రజల మద్దతు పెరిగినంత వేగంగా అతనికి శత్రువులు కూడా పెరుగుతారు.

నంది కిషోర్‌ను అంతమొందించేందుకు ప్రొఫెషనల్ కిల్లర్ కుల్‌దీప్‌ను రంగంలోకి దింపుతారు. అదే సమయంలో, అవంతిక నేతృత్వంలో ‘ఆపరేషన్ పద్మ’ అనే ప్రత్యేక డిటెక్టివ్ టీమ్‌ను ఏర్పాటు చేస్తారు. వాసు, రమణ, పద్మ (సుధ), రూప వంటి సభ్యులతో కూడిన ఈ బృందం కిల్లర్ ప్లాన్‌ను ఎలా అడ్డుకుంది? ఆపరేషన్ పద్మ వెనుక అసలు రహస్యం ఏమిటి? అన్నదే మిగతా కథ.

నటీనటులు

కుల్‌దీప్ పాత్రలో రణధీర్ బీసు స్టైలీష్, ఇంటెన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటాడు. స్క్రీన్‌పై కనిపించకపోయినా కూడా అతని పాత్ర ప్రభావం ప్రేక్షకుడికి ఎప్పుడూ ఫీల్ అవుతుంది. డిటెక్టివ్ టీమ్‌లోని నటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా రఘుపతి రెడ్డి, రజిత శాండీ నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. మహిళా పాత్రలు హై ఎనర్జీతో కథను ముందుకు నడిపిస్తాయి. మిగతా పాత్రలు కూడా తమ పరిధిలో ప్రభావాన్ని చూపిస్తాయి.

విశ్లేషణ

‘ఆపరేషన్ పద్మ’ సాధారణ యాక్షన్ మూవీ కంటే ఎక్కువగా ఒక పరిశోధనాత్మక రాజకీయ థ్రిల్లర్. దాదాపు 90 నిమిషాల పాటు సాగే ఫస్ట్ హాఫ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రతి సీన్ ఒక మైండ్ గేమ్‌లా అనిపిస్తుంది. సమాజంలోని శక్తివంతమైన వ్యక్తులు, వారి రహస్య ఒప్పందాల చుట్టూ కథ తిరుగుతూ ప్రేక్షకుడిని బలంగా కనెక్ట్ చేస్తుంది.

కిల్లర్ మరియు డిటెక్టివ్ టీమ్ మధ్య జరిగే పిల్లి–ఎలుక ఆట సినిమాకే ప్రధాన బలం. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రేక్షకుల ఊహకు భిన్నంగా ఉండటం ప్లస్ పాయింట్.

టెక్నికల్‌గా చూస్తే, అఖిల్ నకిరేకాంతి స్టంట్స్ స్టైలీష్‌గా ఉన్నాయి. కళ్యాణ్ సామి, పవన్మణి సినిమాటోగ్రఫీ కథ మూడ్‌కు తగ్గట్టుగా సాగుతుంది. సుభాష్ ఆనంద్ బీజీఎం థ్రిల్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది. నిర్మాతలు పెట్టిన భారీ బడ్జెట్ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

తుది మాట

‘ఆపరేషన్ పద్మ’ ఒక మైండ్ గేమ్‌లా సాగుతూ ప్రేక్షకుడి ఆలోచనలకు పదును పెట్టే చిత్రం. ఇంటెలిజెంట్ కథనం, రాజకీయ థ్రిల్లర్, సస్పెన్స్ యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చే అవకాశం ఉంది.

రేటింగ్: 2.5/5

Show Full Article
Print Article
Next Story
More Stories