The Ghost Review: 'ది ఘోస్ట్‌' మూవీ రివ్యూ.. నాగ్ దుమ్ముదులిపాడు..

The Ghost Review: కింగ్ నాగార్జునతో ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ది ఘోస్ట్.

Arun Chilukuri
Updated on: 5 Oct 2022 12:03 PM IST
Nagarjuna The Ghost Movie Review
X

The Ghost Review: ‘ది ఘోస్ట్‌’ మూవీ రివ్యూ.. నాగ్ దుమ్ముదులిపాడు..

The Ghost Review: కింగ్ నాగార్జునతో ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ది ఘోస్ట్. స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా దసరా స్పెషల్ గానే వచ్చింది. మరి టీజర్, ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్సే సినిమాకొచ్చిందా? దీ ఘోస్ట్ కత్తి గాట్లకు బాక్సాఫీస్ షేక్ అవుతోందా?

కింగ్ నాగార్జున, సోనాల్ ఛౌహాన్ కాంబినేషన్ లోవచ్చిన స్టైలిష్ యాక్షన్ డ్రామా ది ఘోస్ట్. గరుడ వేగ తర్వాత ప్రవీణ్ సత్తారు మేకింగ్ లో వచ్చన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. మేనకోడలిని వెంటాడే ఓ బ్యాచ్, వాళ్లనుంచి తన సిస్టర్ ని, మేనకోడల్ని కాపాడుకునే మేనమామ తపన.. ఇది సింపుల్ గా ది ఘోస్ట్ స్టోరీ లైన్. కథకంటే,ఈ సినిమాను కథనమే మరో లెవల్ కి తీసుకుపోయిందంటున్నారు. ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ కి ఫ్యామిలీ డ్రామాని యాడ్ చేస్తే ఫైనల్ గా అదే ది ఘోస్ట్ అనుకోవచ్చంటున్నారు.

దీ ఘోస్ట్ లో కత్తిపట్టిన పాత్రలో నాగ్ దుమ్ముదులిపాడు. తను ప్రమోషన్ లో శివ మూవీలో చైన్ లాగిన సీన్ తో పోల్చిన నాగ్, నిజంగానే కత్తితో ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నాడు. ది ఘోస్ట్ రోల్లో పాతుకుపోయాడు. సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్ అండ్ కో పాత్రల పరిది మేరకు ఆకట్టుకున్నారు. ఇక ప్రవీణ్ సత్తారు మేకింగ్ నెక్ట్స్ లెవల్ అనే స్పందనే వస్తోంది. నాగ్ ని మరింత స్టైలిష్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ది ఘోస్ట్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేసస్తే, ప్రవీణ్ సత్తారు నెరేషన్ బాక్సాఫీస్ లో వసూళ్ల వైబ్రేషన్ కి కారణమయ్యేలా ఉంది. మొత్తంగా దసరాకు అటు గాడ్ ఫాదర్, ఇటు ది ఘోస్ట్ సినిమాల దరువు పెరిగేలా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story