రివ్యూ : తోలుబొమ్మలాట

tholu bommalata
x
tholu bommalata
Highlights

మంచి కథ ఆలోచనని ఎంచుకున్న దర్శకుడిని ముందుగా మనం అభినందిచాలి. ఎలాంటి ఐటెం సాంగ్స్ లేకుండా ప్యూర్ ఫ్యామిలీ

ఆ నలుగురు సినిమా తర్వాత నాకు బాగా నచ్చిన కథ ఇది అని తోలుబొమ్మలాట ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు నటకిరీటి రాజేంద్రప్రసాద్.. దీనికి తోడు విడుదలైన సినిమా ట్రైలర్, పాటలు సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో మన రివ్యూలో చూద్దాం..

కథ:

వరుసకి బావమరదళ్ళు అయిన రిషి, వర్షిత ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం.. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. కానీ వీరి ఇరువురు తల్లితండ్రులకి మాత్రం పెద్దగా పడదు. దీనితో ఒకరిని విడిచి మరొకరు ఉండలేక మా పెళ్లిని మీరే జరిపించాలని వాళ్ళ తాతయ్య అయినా సోమరాజు అలియాస్ సోడా రాజు (రాజేంద్ర ప్రసాద్) వెళ్లి అడుగుతారు. దీనికి ఒకే చెప్పిన సోమరాజు ఓ రోజు నిద్రలోనే చనిపోతాడు. ఇక ఇదే సమయంలో రిషి, వర్షితల మధ్య మనస్పర్థల రావడం వల్ల వారు కూడా దూరం అవుతారు.

చనిపోయిన సోమరాజు ఓ ఆత్మ రూపంలో తన కుటుంబం చూట్టూ తిరుగుతూ ఉంటాడు. రిషి, వర్షితలకి ఇచ్చిన మాటను నేరవేర్చలేకపోయానని బాధ పడుతుంటాడు. ఈ నేపధ్యంలో ఆస్థి పంపకాల మధ్య తన పిల్లలుగొడవ పడడం చూసి తట్టుకోలేకపోతుంటాడు. ఇదే సమయంలో ఆత్మలు కనిపించే తన బంధువు అయిన సంతోష్ కి సోమరాజు ఆత్మకి స్నేహం కుదురుతుంది. ఇలా తాను చేయాలనుకున్నా పనులన్నీ సంతోష్ తో చేయిస్తూ ఉంటాడు సోమరాజు.. ఈ క్రమంలో ఆ కటుంబంలో ఆస్తులు కాదు అనుబంధాలు, ప్రేమలు ముఖ్యమని తెలుసుకొని మళ్ళీ ఎలా కలిశారు.దీనికి సోమరాజు వేసిన ప్లాన్స్ ఏంటి ? మళ్ళీ రిషి, వర్షిత కలిశారా లేదా అన్నది తెరపైన చూడాలి.

ఎలా ఉందంటే ?

మంచి కథ ఆలోచనని ఎంచుకున్న దర్శకుడిని ముందుగా మనం అభినందిచాలి. ఎలాంటి ఐటెం సాంగ్స్ లేకుండా ప్యూర్ ఫ్యామిలీ కథను తెరకెక్కించాడు.. మంచి కథని అయితే ఎంచుకున్నాడు కానీ తెరపైన అవిష్కరిచడంలో చాలాచోట్లల్లో తడపడ్డాడు దర్శకుడు. ఫ్యామిలీ సజేక్ట్ అన్నప్పుడు ఎమోషన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంతా బెటర్ .. ఇక్కడ కూడా ఉన్నాయి కానీ అవి మనసుకు హత్తుకునే సన్నివేశాలు కాకుండా పోయాయి. కొన్ని చోట్ల బలంగా చెప్పాల్సిన సన్నివేశాలను కేవలం మాటలతోనే వదిలేశాడు. బావమరదళ్ల మధ్య లవ్ స్టొరీని ఫ్రెష్ గా తెరకెక్కించాడు. ఇక వెన్నల కిషోర్ తో వచ్చే కామెడి సన్నివేశాలు సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. ఓ సీనియర్ దర్శకడు లేని లోటు అయితే సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది.

నటినటులు :

సినిమా మొత్తానికి రాజేంద్రప్రసాద్, వెన్నల కిశోర్ హైలెట్ అని చెప్పాలి. సినిమా మొత్తాని తమ భుజాలపై వేసుకొని నడిపించారు. హీరో విశ్వంత్‌, హీరోయిన్‌ హర్షిత ఉన్నంతలో బాగానే రాణించారు. మిగతా నటినటులు పాత్రల మేరకు ఒకే అనిపించారు.

సాంకేతిక వర్గం :

సతీష్ ముత్యాల కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు చాలా సీన్స్ లో తన కత్తెర కి పని చెబితే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories